బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన పొన్నియన్ సెల్వన్1 సినిమా తెలుగు లో అంచనాలను అందుకోలేక పోయినా తమిళ్ లో మాత్రం సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది, వరల్డ్ వైడ్ గా 500 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా సినిమా రెండో పార్ట్ కోసం తెలుగు ఆడియన్స్ తప్పించి మిగిలిన ఆడియన్స్ ఆశగానే ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి.
తెలుగులో రిలీజ్ అయ్యి టాక్ బాగుంటే సినిమా ఏమైనా జోరు చూపించవచ్చు. మొత్తం మీద పార్ట్ 2 ఏప్రిల్ 28న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా ఎడిటింగ్ రూమ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండగా సినిమా రన్ టైం కూడా…
అందులో కనిపించింది… సినిమా రన్ టైం ఆ రఫ్ కట్ తో కలిపి మొత్తం మీద 4 గంటలకు పైగా ఉంది… ఈ రన్ టైం చూసి ఇండస్ట్రీ మొత్తం శాకవ్వగా అందులో కొంత ఫూటేజ్ మాత్రం కట్ చేసి ఎడిటెడ్ వర్షన్ అంటూ డిజిటల్ రిలీజ్ లో యాడ్ చేసే అవకాశం ఉందని అంటూ ఉండగా…
థియేటర్స్ లో రిలీజ్ అయ్యే వర్షన్ మాత్రం 3 గంటల 20 నిమిషాల లెంత్ తో ఉండవచ్చు అంటున్నారు… ఇది కూడా భారీ లెంత్ అనే చెప్పాలి. మరి మేకర్స్ ఎలాగోలా మరింత ఎడిట్ చేసి 3 గంటల లోపు రన్ టైంని సెట్ చేస్తే కొంచం బెటర్ అని చెప్పొచ్చు. మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది త్వరలో తెలుస్తుంది..