Home న్యూస్ #PSPK27 కి బ్రేక్…ఫస్ట్ మూవీ రిలీజ్ కాలేదు…సాలిడ్ కాంబోలో రెండో సినిమా!!

#PSPK27 కి బ్రేక్…ఫస్ట్ మూవీ రిలీజ్ కాలేదు…సాలిడ్ కాంబోలో రెండో సినిమా!!

662
0

మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే రెండో సినిమా ఆఫర్స్ తక్కువ మందికి సొంతం అవుతాయి, ఇప్పుడు అలాంటి ఆఫర్ నే సొంతం చేసుకున్నాడు మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఉప్పెన సినిమా తో లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా లాక్ డౌన్ వలన నిరవధికంగా పోస్ట్ పోన్ అవ్వగా ఈ లోపు ఇప్పుడు రెండో మూవీ కమిట్ అయ్యాడు.

అది కూడా మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరున్న క్రిష్ డైరెక్షన్ లో…. క్రిష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో 27 వ సినిమాగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ డైరెక్షన్ లో బిజీ గా ఉన్నప్పటికీ కరోనా ఎఫెక్ట్ తో ఇప్పట్లో ఆ షూట్ ని మొదలు పెట్టె అవకాశం…

లేక పోవడం దానికి తోడూ ఫస్ట్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని ఫినిష్ చేయాలి అని డిసైడ్ అవ్వడం తో క్రిష్ ఈ గ్యాప్ లో ఓ చిన్న సినిమా చేద్దామన్న ఆలోచనలో ఉండగా సడెన్ గా వైష్ణవ్ తేజ్ లైన్ లో కి వచ్చాడని సమాచారం.

కథ చెప్పడం ఓకే అవ్వడం హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా కన్ఫాం చేసి ఈ రోజు సినిమా పూజా కార్యక్రమాలు కూడా చేశారని సమచారం. కొంచం గ్యాప్ ఇచ్చి వైరస్ ఎఫెక్ట్ తగ్గగానే నాన్ స్టాప్ గా సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు షూట్ చేయాలనీ క్రిష్ ప్లాన్ చేశారట.

ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తిరిగి పవన్ కళ్యాణ్ 27 వ సినిమా పనుల్లో ఉంటారని సమాచారం. ఈ లోపు పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ ని కంప్లీట్ చేసే అవకాశం ఉంది. రెండో సినిమా కి సాలిడ్ కాంబినేషన్ ని సెట్ చేసుకున్న వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ డేట్ ఇంకా కన్ఫాం అవ్వాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here