ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర మరికొన్ని రోజుల్లో సంచలన రికార్డులను నమోదు చేయడానికి బరిలోకి దిగుతూ ఉండగా సినిమా ఆల్ మోస్ట్ అన్ని ఏరియాలలో సాధించిన బిజినెస్ లెక్కలు బయటికి వచ్చాయి. హిందీ లో సినిమా సాధించిన బిజినెస్ లెక్క ఇప్పుడు బయటికి రాగా అక్కడ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి అని ఇప్పుడు ట్రేడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
కాగా సినిమా హిందీ లో రిలీజ్ రీసెంట్ గా డౌట్ లో పడినా కానీ తిరిగి రేసు లోకి వచ్చి ఇప్పుడు సినిమా హిందీ లో 10 కోట్ల వరకు బిజినెస్ ను సొంతం చేసుకుంది. హిందీ లో ఫస్ట్ అటెంప్ట్ తోనే ఈ రేంజ్ బిజినెస్ ను సాధించడం విశేషం అనే చెప్పాలి.
ఇక సినిమా హిందీ లో ఇప్పుడు క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే 20 కోట్ల రేంజ్ కి తగ్గని నెట్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. హిట్ టాక్ వస్తే ఈ కలెక్షన్స్ ని అక్కడ అందుకోవడం అసలు ఏమాత్రం కష్టం కాదనే చెప్పాలి. మేకర్స్ బాగా ప్రమోట్ చేస్తే కచ్చితంగా పుష్ప అక్కడ కూడా రచ్చ చేసే ఛాన్స్ ఉంది.