రీసెంట్ టైం లో సినిమాల డిజిటల్ రిలీజ్ కి ఎక్కువ సమయం పట్టడం లేదు, పాండమిక్ తర్వాత పరిస్థితులు మారిపోవడం తో చాలా సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాలేదు, కొన్ని అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించాయి…ఇక పాండమిక్ టైం లో చాలా సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా, ఈ ఇయర్ లో కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన…
మాస్టర్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిన రెండు వారాలకే డిజిటల్ లో కూడా రిలీజ్ ను సొంతం చేసుకుంది, తర్వాత కొన్ని చిన్న చితకా మూవీస్ తప్పితే పెద్ద హీరోల సినిమాలు మినిమమ్ 3-4 వారల గ్యాప్ లోనే డిజిటల్ లో కూడా రిలీజ్ అయ్యాయి. కానీ రీసెంట్ గా…
కన్నడ టాప్ స్టార్స్ లో ఒకరైన పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ యువరత్న కన్నడలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు టీం సడెన్ షాకే ఇచ్చారు ఫ్యాన్స్ కి… అక్కడ పెరుగుతున్న కొత్త కేసుల నేపధ్యంలో ఆక్యుపెన్సీ ని 50% కి తగ్గించారు.
దాంతో ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై తీవ్రంగా పడగా టీం ను ఆదుకోవడానికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు త్వరగా రిలీజ్ చేస్తే సాలిడ్ రేటు ఆఫర్ ఇస్తామని చెప్పారు, దాంతో టీం ఓకే చెప్పి ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన 8 వ రోజు సినిమా డిజిటల్ రిలీజ్ లో 9 వ రోజు నుండి అందుబాటులో ఉంటుంది అని కన్ఫాం చేశారు. దాంతో ఈ ఇయర్ స్టార్ హీరోల సినిమాల పరంగా…
అతి తక్కువ గ్యాప్ తో ఆడియన్స్ ముందుకు డిజిటల్ గా వస్తున్న సినిమాగా నిలిచింది. దాంతో కలెక్షన్స్ పరంగా వచ్చిన నష్టాలు ఇప్పుడు డిజిటల్ రిలీజ్ వల్ల కవర్ అవుతాయి అని చెప్పాలి, ఎటొచ్చి కొత్త సినిమాలు ఇదే రూట్ ని ఫాలో అయితే ఇక జనాలు థియేటర్స్ కి వెళ్లి ఆ భారీ టికెట్ రేట్స్ పెట్టి చూడటం కన్నా రెండు మూడు వారాలు ఆగి డిజిటల్ లో చూసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది.