Home న్యూస్ కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ రికార్డులు…బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఖాయం!!

కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ రికార్డులు…బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఖాయం!!

0

కన్నడ పవర్ స్టార్ లేట్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్ ఆడియన్స్ ముందుకు ఇప్పుడు భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అయింది…. లాస్ట్ ఇయర్ సడెన్ గా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయిన పునీత్ రాజ్ కుమార్ అశేష అభిమానులను శోకసముద్రంలో మునిగిపోయేలా చేశాడు… తిరిగి రాని లోకాలకు వెళ్ళిన హీరో నటించిన చివరి సినిమా అయినా జేమ్స్ సినిమాను ఆడియన్స్ ముందుకు ఇప్పుడు….

17న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతుండగా కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ కి ఘన నివాళి ఇచ్చేలా వారం పాటు మరే సినిమా కూడా థియేటర్స్ లో రిలీజ్ అవ్వకుండా ఒక్క ఈ సినిమానే అక్కడ అన్ని చోట్లా రిలీజ్ చేయబోతుండగా ఓవరాల్ గా సినిమా కి అక్కడ….

థియేటర్స్ కౌంట్ లెక్క 400 కి పైగా ఉండబోతుందని సమాచారం… ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా ఓవరాల్ గా సినిమా 250 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుందని సమచారం. వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 4000 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుందని సమాచారం. ఇక సినిమా కి కర్ణాటకలో…

అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వగా సినిమా కి కర్ణాటకలో రికార్డ్ బ్రేకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు సమాచారం. దాంతో అక్కడ ఇప్పుడు సినిమా అక్కడ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు… కాగా కర్ణాటకలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని KGF చాప్టర్ 1 సినిమా 16.50 కోట్ల గ్రాస్ ను అందుకుని సంచలనం సృష్టించగా….

ఇప్పుడు ఈ రికార్డ్ ను జేమ్స్ సినిమా బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేయడం ఖాయమని అంటున్నారు…. అందరు హీరోల ఫ్యాన్స్ కూడా ఈ సినిమా తో పునీత్ రాజ్ కుమార్ కి ఘనమైన నివాళి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు… ఒక వారం పాటు సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here