బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప రీసెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు లాంగ్ వీకెండ్ ని కూడా సొంతం చేసుకుని అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే. లాంగ్ రన్ లో కూడా సినిమా కి హాలిడేస్ అడ్వాంటేజ్ లు ఇప్పుడు దొరకడంతో కష్టం అనుకున్న ఓవరాల్ బ్రేక్ ఈవెన్ ని కూడా పూర్తీ చేసుకుంది ఈ సినిమా.
అది కూడా ఆంధ్రలో ఉన్న పరిస్థితుల వలన అక్కడ విపరీతమైన నష్టాలు వచ్చినా కానీ అక్కడ వచ్చిన నష్టాలను ఇతర ఇండస్ట్రీలలో వచ్చిన కలెక్షన్స్ తో కవర్ అవ్వగా అన్నీ చోట్లా సాధించిన కలెక్షన్స్ ఒకెత్తు అయితే హిందీ లో సినిమా హోల్డ్ చేసిన విధానం…
సాధిస్తున్న కలెక్షన్స్ మరో ఎత్తుగా చెప్పుకోవాలి. సినిమా హిందీ లో రిలీజ్ అవ్వడం చివరి నిమిషం వరకు డౌట్ లోనే ఉండగా చివరి నిమిషంలో రిలీజ్ అయ్యి రోజు రోజు కి కలెక్షన్స్ పరంగా జోరు చూపుతూ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజుల్లో 56 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని…
17 వ రోజు కలెక్షన్స్ తో 62 కోట్ల మార్క్ ని అందుకున్న పుష్ప మూడో వారంలో స్క్రీన్స్ ఇంకా పెంచుకుని సంక్రాంతి వరకు పరుగుకు ఎలాంటి డోకా లేకుండా చూసుకుంది. సింగిల్ స్క్రీన్స్ లో హిందీ లో ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం ఈ సినిమాకే చెల్లింది. అక్షయ్ కుమార్ సూర్యవంశీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించినా అందులో ఎక్కువ భాగం మల్టీ ప్లెక్సులలో సాధించిన కలెక్షన్స్ అనే చెప్పాలి.
కానీ పుష్ప విషయంలో నార్త్ లో చాలా మారుమూల సింగిల్ స్క్రీన్స్ లో కూడా సాలిడ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పటికీ మొదటి రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్స్ ని చూసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలే విస్మయానికి గురి అవుతున్నారు. లాంగ్ రన్ లో సినిమా 80 కోట్లకు పైగా కలెక్షన్స్ ని మినిమమ్ రన్ ఇంకా కొనసాగితే 100 కోట్ల ఛాన్స్ కూడా ఉందని చెబుతూ ఉండటం విశేషం.