ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటిన విషయం తెలిసిందే. ఇద్దరూ కూడా ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన జోరులో ఉన్న కారణంగా ఎక్స్ పెర్టేషన్స్ ఓ రేంజ్ లో పెంచేసిన పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా కొన్ని చోట్ల ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది, కానీ మేజర్ కలెక్షన్స్ వచ్చే తెలుగు వర్షన్ మాత్ర్రం….
ఆంధ్రలో స్పెషల్ షోలు, టికెట్ హైక్స్ లాంటివి లేక పోవడం వలన ఇబ్బందులు ఫేస్ చేయగా టికెట్ హైక్స్ కోసం ట్రై చేయడంతో బుకింగ్స్ ఎక్కడా కూడా ఓపెన్ చేయలేదు, కానీ ఓపెన్ చేసిన కొన్ని చోట్ల బుకింగ్స్ అల్టిమేట్ అనిపించే విధంగా ఉండగా కొన్ని చోట్ల…
ఆన్ లైన్ బుకింగ్స్ ఆన్ చేయకుండా ఆఫ్ లైన్ లోనే టికెట్స్ ని బ్లాక్ లో అమ్ముతూ లో టికెట్ రేట్ల రేటుని కలెక్షన్స్ లో యాడ్ చేయబోతున్నారు. ఇక ఓవరాల్ ఓపెనింగ్స్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఓపెనింగ్స్ అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైం…
బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. నైజాం ఏరియాలో ఆల్ రెడీ 90% ఏరియాల్లో ఫస్ట్ డే టికెట్స్ అన్నీ ఆన్ లైన్ వి సోల్డ్ ఔట్ అయిపోయాయి. నైజాంలో ఫస్ట్ డే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా న్యూ రికార్డ్ ను క్రియేట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సీడెడ్ లో కూడా ఓపెనింగ్స్ ఎక్స్ లెంట్ అనిపించే విధంగా ఉండగా…
ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాలలో 25 కోట్లకు తగ్గని షేర్ ని సొంతం చేసుకోవడం మినిమమ్ గ్యారెంటీలా అనిపిస్తున్నా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అండ్ ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ని బట్టి ఈ లెక్క 30 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక హిందీలో పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ ఉండగా కన్నడలో బుకింగ్స్ కుమ్మేస్తున్నాయి. డే ఎండ్ టైం కి సినిమా ఓవరాల్ స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.