బాక్స్ ఆఫీస్ ప్రీవియస్ వీక్ లో రిలీజ్ అయిన పుష్ప సినిమా ఈ వారంలో రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ సినిమాలు రెండూ కూడా ఈ రోజు బాక్స్ ఆఫీస్ ను బాగా షేక్ చేసేలా ఉన్నాయని చెప్పాలి. క్రిస్టమస్ హాలిడే అడ్వాంటేజ్ ను ఓ రేంజ్ లో వాడుకుని దుమ్ము లేపే వసూళ్ళని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ముందుగా పాత సినిమా పుష్ప విషయానికి వస్తే..
ఈ సినిమా 8 వ రోజు సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంది. ఇక 9 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల టైం కి కేవలం 5-10% వరకు మాత్రమే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా సాగుతున్నాయి…
దాంతో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 8 వ రోజు కన్నా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా 2.4-2.5 కోట్ల రేంజ్ వసూళ్ళని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకునేలా ఉందని చెప్పాలి. ఇక నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా..
రెండో రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది అని చెప్పాలి. ఈ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు తో పోల్చితే 30%-35% అటూ ఇటూగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, దాంతో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 2.6 కోట్ల నుండి లెక్క స్టార్ట్ అయ్యేలా ఉండగా…
షో షో కి సినిమా సాధించే గ్రోత్ ని బట్టి రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 2.6- 2.8 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది. రెండు సినిమాల ఈవినింగ్ అండ్ నైట్ షోల లెక్కలను బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క మరింత ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. మరి 2 సినిమాలు అంచనాలను మించుతాయో లేదో చూడాలి.