ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున డిసెంబర్ 17న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ మూవీ పుష్ప పార్ట్ 1…. ఇప్పటికే సినిమా పై సాలిడ్ అంచనాలు ఉండగా సినిమా లో లేటెస్ట్ సమంత ఐటెం సాంగ్ తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక సినిమా బిజినెస్ కూడా ఆల్ మోస్ట్ ఫినిష్ అయినా కానీ ఆంధ్రలో టికెట్ హైక్స్ కోసం…
ట్రై చేస్తున్నారు… అది త్వరలో ఎదో ఒక విషయం క్లారిటీ రాబోతుంది. ఇక ఈ గ్యాప్ లో థియేటర్స్ అగ్రిమెంట్స్ ని సినిమా కంప్లీట్ చేసుకుంటుంది. ముందుగా నైజాం ఏరియాలో సినిమా ఇనీషియల్ థియేటర్స్ కౌంట్ ని రిలీజ్ చేయగా టోటల్ థియేటర్స్ కౌంట్…
275 థియేటర్స్ మార్క్ ని అందుకోగా రిలీజ్ టైం కి ఇక్కడ 350 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఫైనల్ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెబుతూ ఉండటం విశేషం. ఇక టికెట్ హైక్స్ ఇక్కడ ఎలాగూ ఉండబోతున్న నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా పుష్ప దుమ్ము దుమారం చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు.