కొన్ని కొన్ని సినిమాలకు రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టు నెగటివ్ టాక్ వచ్చినా కానీ తర్వాత టెలివిజన్ లోనో లేక డిజిటల్ లోనే ఆ సినిమాలను చూసినప్పుడు ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ అన్నది ఇంప్రూవ్ అవ్వడం లేదా బెటర్ గా రావడం జరుగుతూ ఉంటాయి… లేటెస్ట్ గా మరీ సూపర్ పాజిటివ్ అని కాదు కానీ రిలీజ్ అయిన రోజు తో పోల్చితే మట్టుకు చాలా బెటర్ టాక్ ని…
ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయినప్పుడు సొంతం చేసుకుంటుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప పార్ట్ 1… ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అయిన రోజు మొదటి ఆట నుండే సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది…
సెకండ్ ఆఫ్ ట్రాక్ తప్పిందని, క్లైమాక్స్ ఎపిసోడ్ ఏమాత్రం బాలేదు అంటూ, దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాలేదు అంటూ చాలా విమర్శలే సొంతం అయ్యాయి. క్లైమాక్స్ పై ఇప్పటికీ కొందరు బాగుందని కొందరు బాలేదని చర్చలు జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా, ఓవరాల్ గా సినిమా పరంగా…
సినిమా బాగుందని, దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉందని బహుశా రిలీజ్ రోజు అన్ని కరెక్ట్ గా ఎడిట్ చేయకపోవడం లాంటివి అలాంటి ఫీలింగ్ ని కలిగించి ఉండవచ్చని, కానీ ఓవరాల్ గా చెప్పాలి అంటే థియేటర్స్ లో కన్నా కూడా డిజిటల్ లో చూసినప్పుడు సినిమా పై ఇంప్రెషన్ పెరిగింది అంటూ చెబుతున్నారు చాలా మంది… ఇక పుష్ప సినిమా మీద…
ఇండియా వైడ్ గా సెలబ్రిటీలు అందరూ కూడా వరుస పెట్టి సినిమా చూశాం చాలా బాగుంది అంటూ మెచ్చుకుంటూ ఉండటం వాటికి అల్లు అర్జున్ థాంక్స్ చెప్పడం జరుగుతూనే ఉంది, మొత్తం మీద సినిమా రిలీజ్ రోజు టాక్ ఫైనల్ కాదని బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఫైనల్ అని పుష్ప సినిమా నిరూపించింది అని చెప్పాలి. సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి….