ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మూడు వారాలు పూర్తీ అవ్వగా ఆడియన్స్ నుండి మొదటి రోజు సినిమాకి మిక్సుడ్ టాక్ వచ్చింది కానీ తర్వాత ఆ టాక్ ని కూడా పట్టించుకోకుండా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ రన్ లో ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపే విజయాన్ని….
ఓవరాల్ గా సొంతం చేసుకుంది… కానీ అదే టైం లో సినిమా కి ఆంధ్రలో లో టికెట్ రేట్ల వలన గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఆ దెబ్బ వలనే ఆంధ్రప్రదేశ్ లో తప్పితే మిగిలిన అన్ని చోట్లా కూడా సినిమా కి అద్బుతమైన ప్రాఫిట్ లభించింది కానీ…
అదే టైం లో ఆంధ్రలో మాత్రం సినిమా కి విపరీతమైన నష్టాలు సొంతం అయ్యాయి. దానికి తోడూ ఇప్పుడు సినిమా డిజిటల్ రిలీజ్ కూడా అయ్యింది. దాంతో నిర్మాతలు రీసెంట్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రలో రన్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ లాస్ ఎంత వచ్చిందో చూసి అందులో…
సగం వరకు బయ్యర్స్ కి డిస్ట్రిబ్యూటర్లకి రిటర్న్ ఇవ్వబోతున్నాం అంటూ తెలియజేశారు… ఓవరాల్ గా 3 వారాల లెక్కలను గమనిస్తే…ఆంధ్రలో సినిమా కి 65.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది, అందులో 3 వారాలు రికవరీ అయిన తర్వాత సినిమా మొత్తం మీద 43.88 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు రికవరీని సొంతం చేసుకోగలిగింది… దాంతో బిజినెస్ ను అందుకోవాలి అంటే సినిమా కి ఇంకా 21.87 కోట్ల దాకా రికవరీ…
చేయాల్సిన అవసరం ఉండగా పరుగు కంప్లీట్ అయ్యే టైం కి ఇందులో మరో 1.87 కోట్లు రికవరీ అయినా కానీ 20 కోట్ల నష్టం వచ్చింది అనుకున్నా అందులో మేకర్స్ 10 కోట్లు రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. మిగిలిన నష్టం బయ్యర్స్ డిస్ట్రిబ్యూటర్లు బరించాల్సి ఉంటుంది… ఒకవేళ సంక్రాంతి సెలవుల్లో సినిమా ఇంకా వసూళ్లు సాధిస్తే ఇంకా మంచిది అని చెప్పాలి.