బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకుని దుమ్ము లేపే వసూళ్ళతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసింది. సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అన్నీ మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టాలీవుడ్ చరిత్రలోనే మూడో రోజు హైయెస్ట్ కలక్షన్స్ ని సొంతం చేసుకున్న….
సినిమాల పరంగా నాన్ బాహుబలి రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ నాన్ బాహుబలి రికార్డ్ కూడా ఇది వరకు అల్లు అర్జున్ పేరు మీదే ఉండగా ఇప్పుడు ఆ రికార్డ్ ను మళ్ళీ తానె సొంతం చేసుకోవడం, అది కూడా మరోసారి….
3 కోట్లకు పైగా లీడింగ్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. టోటల్ గా సినిమా మూడో రోజు 14.38 కోట్ల షేర్ ని అందుకోగా టాప్ రికార్డ్ బాహుబలి 2 పేరిట అలానే కొనసాగుతూ ఉంది. ఒకసారి టోటల్ గా టాప్ 10 మూవీస్ లిస్టు ను గమనిస్తే…
👉#Baahubali2 -16.60Cr
👉#Pushpa – 14.38Cr***
👉#AlaVaikunthapurramuloo – 11.21Cr
👉#Saaho – 11.16Cr
👉#VakeelSaab – 10.43Cr
👉#Rangasthalam – 10.05Cr
👉#Baahubali -9.49Cr
👉#DJ – 8.62Cr
👉#BharatAneNenu – 8.41Cr
👉#Uppena – 8.26Cr
ఈ లిస్టులో ప్రభాస్ వి మూడు సినిమాలు ఉండగా ఇప్పుడు అల్లు అర్జున్ వి కూడా మూడు సినిమాలు చోటు ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా ఈ లిస్టులో…
మరో స్పెషల్ ఏంటంటే లిస్టులో నెగటివ్ టాక్ లేదా మిక్సుడ్ టాక్ తో కూడా రికార్డ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు DJ, సహో మరియు ఇప్పుడు పుష్ప సినిమాలు అని చెప్పాలి. మూడు రోజులు సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న పుష్ప సినిమా అప్ కమింగ్ డేస్ లో ఇంకా ఏ రేంజ్ లో లో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక….