2021 ఇయర్ లో అనేక సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అవ్వాల్సింది కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన చాలా పెద్ద సినిమాలు ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకోలేక పోయాయి. కానీ ఉన్నంతలో ఈ ఇయర్ లో లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే కొంచం బెటర్ గానే సినిమాలు రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి అని చెప్పాలి. వాటిలో హైయెస్ట్ కలెక్షన్స్ ని రీసెంట్ గా రిలీజ్ అయిన అల్లు అర్జున్…
పుష్ప సినిమా సొంతం చేసుకుని దుమ్ము లేపగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఇయర్ లో వచ్చిన సినిమాలలో తెలుగు రాష్ట్రాలలో రోజుకి కోటి కి ఏమాత్రం తగ్గకుండా షేర్స్ ని సొంతం చేసుకున్న సినిమాల….
విషయంలో పుష్ప సినిమా ప్రీవియస్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుంది అనుకున్నా అలా జరగలేదు. ఈ ఇయర్ మొదట్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా జాతిరత్నాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో వరుస పెట్టి 12 రోజుల పాటు రోజుకి కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని రికార్డ్ కొట్టగా…
రెండో ప్లేస్ లో ఉప్పెన సినిమా, అఖండ సినిమాలు 11 రోజుల పాటు వరుస పెట్టి 1 కోటి షేర్ ని అందుకున్నాయి. ఇప్పుడు పుష్ప సినిమా కి ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం ఉన్నా 12 వ రోజు 69 లక్షలతో రికార్డ్ ను మిస్ చేసుకోగా 11 రోజులతో ఉప్పెన అఖండ ల తో సమంగా నిలిచింది. ఇక 10 రోజుల పాటు ఈ రికార్డ్ ను…
క్రాక్ మూవీ తర్వాత వకీల్ సాబ్ సినిమాలు సొంతం చేసుకున్నాయి, పుష్ప కి ఈ రికార్డ్ ను అందుకునే మంచి ఛాన్స్ ఉన్నా కానీ ఓవరాల్ గా 11 రోజులతో సరిపెట్టుకోగా చిన్న సినిమా జాతిరత్నాలు మీద ఈ ఇయర్ లో మరే సినిమా సాధించని రేర్ రికార్డ్ సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక వచ్చే ఇయర్ ఎన్ని సినిమాలు ఈ లిస్టు లో ఉంటాయో చూడాలి.