టాలీవుడ్ లో రీసెంట్ టైం లో లిరికల్ సాంగ్స్ రికార్డులు కూడా సినిమా పై ఎలాంటి క్రేజ్ ఆడియన్స్ లో ఉందని రిప్రేజంట్ చేయడానికి బాగా పనికి వస్తున్నాయి. సాంగ్ ఫస్ట్ 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది, తర్వాత లాంగ్ రన్ లో ఎంత బాగా హోల్డ్ చేసింది అన్న దానిపై ఆ సాంగ్ ఏ రేంజ్ రీచ్ ని సొంతం చేసుకుందో అన్నది తెలుస్తుంది. భీమ్లా నాయక్ గ్లిమ్స్ లో…
వచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ లాలా భీమ్లా ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారి టాలీవుడ్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది. తర్వాత లిరికల్ వీడియో రిలీజ్ చేసిన టైం లో టాలీవుడ్ రికార్డులతో పాటు ఏకంగా సౌత్ రికార్డులను కూడా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది.
24 గంటల్లో 10.2 మిలియన్ వ్యూస్ ని అందుకుని ఫస్ట్ 10 మిలియన్ వ్యూస్ సాంగ్ గా సరికొత్త రికార్డ్ ను సౌత్ లో నమోదు చేయగా… రీసెంట్ గా పుష్ప పార్ట్ 1 లో సమంత చేస్తున్న ఐటెం సాంగ్ అయిన ఊ అంటావా ఊహు అంటావా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్ ని…
ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలన వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని భీమ్లా సాంగ్ రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సాంగ్ కి 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి వ్యూస్ పరంగా 12.39 మిలియన్ వ్యూస్ దక్కి సౌత్ లోనే ఆల్ టైం హైయెస్ట్ వ్యూస్ ని 24 గంటల్లో సొంతం చేసుకుని…
ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయగా లైక్స్ పరంగా 634.1K లైక్స్ ని అందుకుని ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ను టాలీవుడ్ లో సొంతం చేసుకుంది. టాప్ ప్లేస్ లో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ 805.5K లైక్స్ తో ఇప్పటికీ టాప్ లో ఉండగా వ్యూస్ పరంగా మాత్రం బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేసి సినిమా పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది పుష్ప ఐటెం సాంగ్…