ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ పుష్ప పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు రావడానికి టైం వచ్చేసింది. అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతుండగా అల వైకుంఠ పురంలో సినిమా తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన…
అల్లు అర్జున్ ఇప్పుడు మళ్ళీ అలాంటి మ్యాజిక్ ని బాక్స్ ఆఫీస్ బరిలో చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. పుష్ప సినిమా మీద అంచనాలు కూడా ఇదే రేంజ్ లో ఉండటం తో ఈ మ్యాజికల్ పాజిటివ్ టాక్ వస్తే సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసే…
అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న పుష్ప సినిమా టాలీవుడ్ లో కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో సొంతం చేసుకునే రేంజ్ లో బిజినెస్ ను సాధించింది. ఒక సారి ఆ డీటైల్స్ ని గమనిస్తే…
👉Nizam: 36Cr
👉Ceeded: 18Cr
👉UA: 12.25Cr
👉East: 8Cr
👉West: 7Cr
👉Guntur: 9Cr
👉Krishna: 7.5Cr
👉Nellore: 4Cr
AP-TG Total:- 101.75CR
Karnataka: 9Cr
Tamilnadu: 6Cr
Kerala: 4Cr
Hindi: 10Cr
ROI: 1.15Cr
OS – 13Cr
Total WW: 144.90CR
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్…
సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 146 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయిన అల వైకుంఠ పురంలో లాంటి బాక్స్ ఆఫీస్ మ్యాజిక్ ని మళ్ళీ రీ క్రియేట్ చేయాలి పుష్ప సినిమా. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ రాంపేజ్ ఎలా ఉంటుందో చూడాలి.