Home న్యూస్ 24 గంటలు ఓవర్…2-3 తో….మాస్ భీభత్సం!

24 గంటలు ఓవర్…2-3 తో….మాస్ భీభత్సం!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఆ అంచనాలను అందుకోవడానికి రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కాగా ట్రైలర్ లో మరీ మాస్ కంటెంట్ ఎక్కువగా ఉందనిపించడం, కథ కూడా నార్మల్ గానే ఉందనేలా ఉండటం లాంటివి కొంచం ఆలోచించేలా చేసినా కానీ…

అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్ కానీ, నటన కానీ, లుక్స్ కానీ, యాటిట్యూడ్ కానీ సినిమా పై ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెంచేలా చేశాయి అని చెప్పాలి. దాంతో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా రెస్పాన్స్ మాత్రం నెక్స్ట్ లెవల్ లో సొంతం చేసుకుంది…

ఈ ట్రైలర్ అని చెప్పాలి… ఇక ట్రైలర్ ను సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అనుకుంటే ఊరించి ఊరించి ఎప్పుడో నైట్ 9:18 నిమిషాల టైంకి రిలీజ్ చేశారు మేకర్స్…అదైనా ప్రాపర్ గా చేశారా అంటే ట్రైలర్ ను ప్రైవేట్ మోడ్ లో పెట్టి రిలీజ్ చేయడంతో సెర్చ్ లో కనిపించకపోవడంతో…

చాలా గంటల పాటు వ్యూస్ అండ్ లైక్స్ ని కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి ఇరిటేటింగ్ లేట్ రిలీజ్ అయినా కానీ 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి పుష్ప ట్రైలర్ యూట్యూబ్ లో 15.19 మిలియన్ అప్ డేట్ అయిన వ్యూస్ ని అలాగే 893K లైక్స్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ రెస్పాన్స్ ను దక్కించుకోవడం విశేషం. వ్యూస్ పరంగా ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను…

24 గంటల్లో సొంతం చేసుకున్న పుష్ప ట్రైలర్ లైక్స్ పరంగా ఆల్ టైం టాప్ 2 ప్లేస్ తో దుమ్ము లేపింది. సరైన టైం కి పక్కా గా రిలీజ్ చేసి ఉంటే కచ్చితంగా వ్యూస్ అండ్ లైక్స్ పరంగా కొత్త రికార్డులను నమోదు చేసి ఉండేది పుష్ప ట్రైలర్… అయినా కానీ ఇన్ని అవరోధాల నడుమ అటు టాప్ 2 ఇటు టాప్ 3 తో రచ్చ చేసిన పుష్ప ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 17న ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here