Home న్యూస్ పుష్ప2 ఫస్ట్ సాంగ్ ‘పుష్ప పుష్ప’ రివ్యూ….అస్సలు తగ్గదే లే!!

పుష్ప2 ఫస్ట్ సాంగ్ ‘పుష్ప పుష్ప’ రివ్యూ….అస్సలు తగ్గదే లే!!

0

ఈ ఇయర్ ఇండియా వైడ్ గా భారీ ఆశలతో రిలీజ్ కి సిద్ధం అవుతున్న పాన్ ఇండియా మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie)….హ్యుమంగస్ క్రేజ్ నడుమ రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా…

ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పటి వరకు సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఓ రేంజ్ లో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక రీసెంట్ గా సినిమా నుండి మొదటి సాంగ్ అయిన పుష్ప పుష్ప(PUSHPA PUSHPA (Telugu Lyrical) Pushpa 2 The Rule)  ని రిలీజ్ చేశారు. ప్రోమో రిలీజ్ చేసినప్పుడు పుష్ప పుష్ప అంటూ వచ్చిన…

చిన్న వీడియో తో సాంగ్ కొంచం తేడా కొట్టేలా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ పడ్డా కానీ ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక్క నెగటివ్ ఫీల్ లేకుండా ఓ రేంజ్ లో మెప్పించాడు దేవి శ్రీ ప్రసాద్…అల్టిమేట్ సౌండ్ తో ఫస్ట్ విన్నప్పుడే ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ లా అనిపించిన పుష్ప సాంగ్ పుష్ప క్యారెక్టర్ పై తెరకెక్కగా…

లిరిక్స్ అన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి. సాంగ్ మధ్యలో అల్లు అర్జున్ వేసిన సింపుల్ స్టెప్స్ కూడా ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేయగా మొదటి పార్ట్ లో తగ్గేదే లే అంటూ చెప్పిన డైలాగ్ ను కొంచం మాడిఫై చేసి ‘అస్సలు తగ్గదే లే’ అంటూ డైలాగ్ చెప్పి సాంగ్ ను ఎండ్ చేయడం బాగుంది… మరీ ఫాస్ట్ స్టెప్స్ వేసే సాంగ్ కాకపోయినా…

అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో స్టెప్స్ తో సాంగ్ లో ఆకట్టుకున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మునుపటి ఫామ్ ను గుర్తి చేస్తూ సాలిడ్ ఔట్ పుట్ ఇవ్వగా ఇక సోషల్ మీడియా ఈ సాంగ్ తో షేక్ అవ్వడం ఖాయమని చెప్పాలి. 24 గంటల్లో సాంగ్ ఇప్పుడు ఏ రేంజ్ లో వ్యూస్ అండ్ లైక్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here