సెన్సేషనల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఊరమాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, లాంగ్ 4 డేస్ వీకెండ్ లోనే ఊహకందని రేంజ్ లో వసూళ్ళ జాతర సృష్టించింది…ఇక సినిమా సాలిడ్ రికవరీని కూడా సొంతం చేసుకున్న తర్వాత…
వర్కింగ్ డేస్ లో మంచి హోల్డ్ తో రన్ ని కొనసాగిస్తూ ఉండగా ఇప్పుడు ఓవరాల్ గా మొదటి బ్రేక్ ఈవెన్ ఏరియాని పూర్తి చేసుకుని మాస్ రచ్చ చేసింది…సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా పక్క రాష్ట్రం కర్ణాటకలో మాత్రం సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…
దుమ్ము దుమారం లేపుతూ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని ఆల్ మోస్ట్ పూర్తి చేసుకుని సంచలనం సృష్టించింది. కర్ణాటకలో సినిమా కి ఆల్ మోస్ట్ 32 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓపెనింగ్ వీకెండ్ లోనే వీర లెవల్ లో కుమ్మేసిన సినిమా 4 రోజుల వీకెండ్ లో…
ఏకంగా 31 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా 5వ రోజు వర్కింగ్ డే లో మరోసారి అక్కడ మంచి హోల్డ్ ని చూపించడంతో ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ మొత్తాన్ని కర్ణాటకలో రికవరీ చేసిన సినిమా ఆల్ రెడీ మైనర్ ప్రాఫిట్స్ జోన్లోకి ఎంటర్ అవ్వగా…
6వ రోజు నుండి సాధించే కలెక్షన్స్ తో ఫుల్ లాభాలను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా కర్ణాటకలో హోల్డ్ చేస్తున్న తీరు చూస్తూ ఉంటే లాంగ్ రన్ లో వాల్యూ బిజినెస్ మీద సాలిడ్ లాభాలను సొంతం చేసుకుని కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.