Home TRP రేటింగ్ 1765 కోట్ల పుష్ప2 1st టైం TRP రేటింగ్….ఇది ఊహించలేదు!!

1765 కోట్ల పుష్ప2 1st టైం TRP రేటింగ్….ఇది ఊహించలేదు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన ప్రతీ మూవీకి టెలివిజన్ లో సాలిడ్ టి.ఆర్.పి రావాలి అన్న రూల్ ఏమి లేదు…కొన్ని సినిమాలు మాత్రం అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు టెలివిజన్ లో కూడా మంచి రేటింగ్స్ తో కుమ్మేస్తూ ఉంటాయి…కానీ ఎందుకనో రీసెంట్ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు చూపించిన సినిమాలు….

టెలివిజన్ కి వచ్చే సరికి మాత్రం పెద్ద చిన్న అన్న తేడా లేకుండా చాలా తక్కువ మాత్రమే అంచనాలను అందుకుంటూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన…

ఎపిక్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ ఊచకోత కోసింది. హిందీలో ఎపిక్ విజయాన్ని అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా వీర లెవల్ లో కుమ్మేసింది.

Pushpa 2 The Rule 52 Days Total WW Collections Report!!

ఓవరాల్ గా తర్వాత డిజిటల్ లో కూడా ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని కుమ్మేసిన ఈ సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో మంచి ప్రమోషన్స్ ను జరుపుకుని టెలికాస్ట్ అయింది. సినిమా శాటిలైట్ రైట్స్ కోసం భారీ రేటు చెల్లించు స్టార్ మా ఛానెల్ హక్కులు తీసుకోగా…

మంచి ప్రమోషన్స్ ని చేసి రీసెంట్ గా టెలికాస్ట్ చేయగా సినిమా రేటింగ్ కచ్చితంగా రికార్డులతో విరుచుకుపడుతుంది అని అందరూ అనుకున్నారు కానీ అలా ఏమి జరగలేదు. చాలా సాదాసీదా టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా..

బాక్స్ ఆఫీస్ దగ్గర 1765 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసిన ఈ సినిమా టెలివిజన్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఓవరాల్ గా 12.61 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ సినిమాలకు టెలివిజన్ లో కూడా సాలిడ్ రేటింగ్స్ సొంతం అవుతాయి కానీ ఈ సినిమా కి మాత్రం అనుకున్న రేంజ్ లో రేటింగ్ సొంతం కాలేదు అనే చెప్పాలి.

Pushpa 2 The Rule 53 Days Total WW Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here