బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప2(Pushpa2 The Rule Movie)….
ఆల్ రెడీ పక్క రాష్ట్రం కర్ణాటకలో వాల్యూ బిజినెస్ ను దాటేసి లాభాల లోకి ఎంటర్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసిన ఈ సినిమా ఇప్పుడు మరో మేజర్ ఏరియాలో వాల్యూ బిజినెస్ ను దాటేసి లాభాల లోకి ఎంటర్ అయ్యింది…
సినిమా కి మొదటి నుండి కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న హిందీ మార్కెట్ లో సినిమా ఇప్పుడు 8 రోజుల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ బిజినెస్ మార్క్ ని దాటేసి లాభాలలోకి ఎంటర్ అయ్యింది. ఇక మీదట ఇక్కడ వచ్చేవన్నీ కూడా సినిమాకి సాలిడ్ లాభాలు అనే చెప్పాలి..
సినిమాకి హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఓవరాల్ గా బిజినెస్ 200 కోట్ల దాకా జరిగింది. సినిమా ఆల్ రెడీ హిందీలో 430 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా 8 రోజుల్లో హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి షేర్ 200 కోట్ల మార్క్ ని దాటేసి…
లాభాలలోకి ఎంటర్ అయ్యింది….8 రోజుల్లో 203 కోట్ల లోపు షేర్ తో దూసుకు పోతున్న పుష్ప2 మూవీ లాంగ్ రన్ లో హిందీలో ఊహకందని రేంజ్ లో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా లాంగ్ రన్ లో ఇక్కడ ఏ రేంజ్ లో లాభాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.