బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) అన్ని చోట్లా కుమ్మేస్తూ దుమ్ము లేపుతూ ఉండగా రెండో వీకెండ్ లో సాధించిన ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తర్వాత…
వర్కింగ్ డేస్ లో కూడా మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా సాధించిన మమ్మోత్ 617 కోట్ల బిజినెస్ ను అందుకుంటుందో లేదో అని ముందు అనుకున్నా కూడా ఇప్పుడు ఆ బిజినెస్ మీద లాభాల లోకి కూడా ఎంటర్ అయ్యి దుమ్ము లేపుతూ ఉండగా…
ఓవరాల్ గా సినిమా 3 ఏరియాల్లో ఇప్పుడు బిజినెస్ ను దాటేసి లాభాలలోకి ఎంటర్ అయింది. ముందు కర్ణాటక ఏరియాలో సినిమా 32 కోట్ల బిజినెస్ మీద ఇప్పటి వరకు 47 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా ఇక రెండో బ్రేక్ ఈవెన్ ఏరియా అయిన హిందీ మార్కెట్ లో…
200 కోట్ల బిజినెస్ మీద ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 282 కోట్లకు పైగా షేర్ తో ఊహకందని లాభాలతో దూసుకు పోగా ఇక సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో 100 కోట్ల బిజినెస్ మీద 103 కోట్లకు పైగా షేర్ తో మూడో బ్రేక్ ఈవెన్ ఏరియాగా నిలిచింది…
నార్త్ అమెరికాలో సినిమా మరికొంత కష్టపడాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా ఓవర్సీస్ ఏరియాలో బ్రేక్ ఈవెన్ ని అందుకుంది….ఇక సినిమా మిగిలిన ఏరియాల్లో కేరళ మరియు తమిళ్ ఏరియాల బిజినెస్ లు ఔట్ ఆఫ్ రీచ్ లో ఉన్నాయని చెప్పాలి…
అదే టైంలో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కోసం మరికొంత కష్టపడాల్సిన అవసరం ఉండగా క్రిస్టమస్ వీకెండ్ మూవీస్ ని తట్టుకుని నిలబడితే లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎన్ని ఏరియాల్లో వాల్యూ బిజినెస్ ను అందుకుంటుందో చూడాలి.