వరల్డ్ వైడ్ గా ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 617 కోట్ల మమ్మోత్ బిజినెస్ ను సొంతం చేసుకుని 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వరల్డ్ వైడ్ గా 10 వేల 400 వరకు థియేటర్స్ లో రికార్డ్ లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా…
సెన్సేషనల్ బుకింగ్స్ తో దూసుకు పోతుంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ముందే ఓపెన్ అయ్యి సాలిడ్ ట్రెండ్ ను చూపించగా ఇండియాలో రీసెంట్ గా బుకింగ్స్ ఓపెన్ అయ్యి ఫెంటాస్టిక్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా ఓవరాల్ గా…
తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా బుకింగ్స్ ను హిందీలో 34 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను అందుకోగా ఓవర్సీస్ లో 4.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకోగా ఇతర వర్షన్ లు పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా ఓవరాల్ గా ఇప్పటి వరకు…
వరల్డ్ వైడ్ గా గ్రాస్ బుకింగ్స్ లెక్క 138-140 కోట్ల రేంజ్ లో ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…తెలుగు రాష్ట్రాల్లో 90-95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే ఛాన్స్ ఉంది ప్రీమియర్స్ తో కలిపి లెక్క ఇంకా పెరగవచ్చు…ఇక హిందీలో సినిమా మొదటి రోజు 65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది…
ఇక తమిళ్ కేరళ మరియు కర్ణాటక కలిపి సినిమా 26-30 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం ఉంది. దాంతో టోటల్ గా ఇండియాలో సినిమా 190-195 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఇక ఓవర్సీస్ లో ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే…
సినిమా అక్కడ 6.5-7 మిలియన్ డాలర్స్ రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం ఉండగా ఇండియన్ కరెన్సీలో 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది…ఇవన్నీ ఎర్లీ ఎస్టిమేషన్స్ కాగా టాక్ ను బట్టి ఆక్యుపెన్సీని బట్టి…
కలెక్షన్స్ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ ట్రెండ్ ను బట్టి సినిమా మొదటి రోజున 250-260 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక టాక్ ను బట్టి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి లెక్క ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి ఇక…