బాక్స్ ఆఫీస్ దగ్గర మూడేళ్ళ క్రితం రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించక పోయినా కూడా వరల్డ్ వైడ్ గా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా కుమ్మేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పుష్ప పార్ట్ 1 సాలిడ్ హిట్ తర్వాత మూడేళ్ళ టైం గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉంది…సినిమా సీక్వెల్ మాసివ్ క్రేజ్ వలన అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని..
సొంతం చేసుకోగా ఇప్పుడు కేవలం రోజున్నర గ్యాప్ లోనే పుష్ప 1 టోటల్ రన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతుంది….పుష్ప పార్ట్ 1 టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో 85.35 కోట్ల షేర్ ని అందుకోగా హిందీ లో 107 కోట్ల కి పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…
టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా 184.62 కోట్ల షేర్ ని 360 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి పుష్ప 2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో 90 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా హిందీ మార్కెట్ లో ఊచకోత కోస్తూ…
2 రోజుల్లోనే ఏకంగా 131 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఏకంగా 229 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా 425 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని ఊహకందని రికార్డులతో ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది. ఇక లాంగ్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో వసూళ్ళతో ఊచకోత కోస్తుందో చూడాలి.