బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సెన్సేషనల్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule) అన్ని చోట్లా రికార్డులను చెల్లాచెదురు చేసి మాస్ భీభత్సం సృష్టించింది…హిందీ లో అయితే రికార్డ్ ముక్క మిగలకుండా చేసి ఊహకందని సక్సెస్ ను సొంతం చేసుకుంది…
తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా సెన్సేషనల్ రన్ ను 50 రోజులకు పైగా సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. కాగా సినిమా డిజిటల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు ఆల్ మోస్ట్ అన్ని ఏరియాల్లో రన్ ఎండ్ అయిపోగా…ఒక్కో ఏరియాలో ఫైనల్ షేర్ లెక్కలు బయటికి వస్తూ ఉన్నాయి.
కాగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తర్వాత రెండు మూడు రోజుల్లో డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ అందుకునే విషయంలో దెబ్బ పడుతుందేమో అనిపించిన ఏరియాల్లో రాయలసీమ ఏరియా ముందు నిలుస్తుంది అని చెప్పాలి.
మొదటి రోజు సెన్సేషనల్ స్టార్ట్ తర్వాత సినిమా ఇక్కడ కొంచం స్లో డౌన్ అవ్వడంతో రికార్డ్ లెవల్ లో చేసిన 30 కోట్ల బిజినెస్ ను సినిమా రికవరీ చేస్తుందో లేదో అన్న డౌట్స్ నెలకొన్నప్పటికీ కూడా ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన సినిమా ఇక్కడ ఫైనల్ రన్ లో…
30 కోట్ల బిజినెస్ ను సైతం దాటేసి టాలీవుడ్ చరిత్రలో నాన్ రాజమౌళి మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. ఫైనల్ రన్ లో సీడెడ్ లో పుష్ప 2 మూవీ ఏకంగా 35.70 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది..
ఓవరాల్ గా ముందు కొంచం డౌట్ కొట్టినా కూడా 30 కోట్ల బిజినెస్ మీద సినిమా 5.7 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను ఇక్కడ సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచి కుమ్మేసింది పుష్ప2 మూవీ…
Fake collections