రిలీజ్ అయిన రోజు నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) అన్ని చోట్లా వీర లెవల్ లో కుమ్మేస్తుంది అని తెలిసినా కూడా టాలీవుడ్ లో రాయలసీమ ఏరియాలో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూశారు…మిగిలిన టాప్ స్టార్స్ తో పోల్చితే…
అల్లు అర్జున్ కి ఇక్కడ డీసెంట్ ఫాలోయింగ్ ఉన్నా ఎప్పుడూ మరీ భీభత్సమైన రికార్డులు ఏమి నమోదు కాలేదు, కానీ అల వైకుంఠ పురంలో కానీ, పుష్ప1 సినిమాలు కానీ ఇక్కడ మంచి కలెక్షన్స్ తో కుమ్మేశాయి…దాంతో భారీ క్రేజ్ ఉన్న పుష్ప2 మూవీ కి ఇక్కడ ఏకంగా…
30 కోట్ల రేంజ్ లో ఎపిక్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ మార్క్ ని ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా అల్లు అర్జున్ కొడతాడో లేదో అన్న డౌట్స్ అందరిలో నెలకొనగా…అందరి అంచనాలను తలకిందలు చేస్తూ మొదటి రోజే ఎపిక్ కలెక్షన్స్ ని ఇక్కడ సాధించగా…
ఓపెనింగ్స్ అయితే వచ్చాయి లాంగ్ రన్ లో బిజినెస్ ను రికవరీ చేస్తుందో లేదో అని అందరూ అనుకున్నారు….రెండో రోజు కొంచం డ్రాప్స్ చూసి ఇక సినిమా తేరుకోదు ఏమో అని కూడా అనుకోగా సినిమా మాత్రం ఊరమాస్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని ఇప్పుడు….
16 రోజుల్లోనే 30 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది బిజినెస్ ను రికవరీ చేసింది. 17వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ప్రాఫిట్స్ ను కూడా సొంతం చేసుకోవడం మొదలు పెట్టిన సినిమా ఓవరాల్ గా రాయలసీమ ఏరియాలో ఎపిక్ లీగ్ లో చేరింది..
30 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్ ని అందుకున్న నాలుగో సినిమాగా నిలిచింది…ఎన్టీఆర్ 2 సార్లు ఇక్కడ ఈ మార్క్ ని అందుకుంటే ప్రభాస్-రామ్ చరణ్ లు ఒకసారి ఈ మార్క్ ని అందుకోగా ఇప్పుడు పుష్ప2 తో మొదటి సారి ఈ మార్క్ ని అందుకున్నాడు అల్లుఅర్జున్. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇక్కడ ఎలాంటి లాభాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.