Home న్యూస్ పుష్ప2 హిందీ 1st డే కలెక్షన్స్…బాలీవుడ్ కుంభస్థలం బద్దలు కొట్టిన అల్లు అర్జున్!!

పుష్ప2 హిందీ 1st డే కలెక్షన్స్…బాలీవుడ్ కుంభస్థలం బద్దలు కొట్టిన అల్లు అర్జున్!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా మీద ఫస్ట్ నుండి ఇక్కడ మార్కెట్ కన్నా కూడా బాలీవుడ్ మార్కెట్ లో క్రేజ్ మరో లెవల్ లో ఉంది…సినిమా ముందు అనుకున్న ఆగస్టు 15న కనుక రిలీజ్ అయ్యి ఉంటే స్త్రీ2 సినిమా కి డబుల్ అనిపించే రేంజ్ లో కుమ్మేసేది…

కానీ ఎలాంటి హాలిడే లేకుండా నార్మల్ వర్కింగ్ డేలో రిలీజ్ అయిన పుష్ప2 మూవీ ఎలాంటి ఓపెనింగ్స్ ను హిందీలో అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా ముందు బుకింగ్స్ ట్రెండ్ సాలిడ్ గా స్టార్ట్ అయినా కూడా తర్వాత కొంచం స్లో అయింది…కానీ రిలీజ్ రోజుకి వచ్చే సరికి మాత్రం…

మాస్ సెంటర్స్ లో ఊహకందని ఊచకోత కోయడం మొదలు పెట్టిన అల్లు అర్జున్, టాప్ ప్లేస్ కొట్టడం కొంచం కష్టమని ముందు అనుకున్నా కూడా తర్వాత తన మాస్ పవర్ తో ఏకంగా బాలీవుడ్ లో కుంభస్థలం బద్దలు కొట్టి ఎపిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపాడు…

సినిమా మొదటి రోజు హిందీలో 65 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయం అనుకోగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 70 కోట్ల ఛాన్స్ కొద్ది వరకు ఉంటుందని అనుకున్నా….సినిమా ఆ అంచనాలను సైతం మించి పోయి మొదటి రోజు ఊహకందని రేంజ్ లో రికార్డ్ సృష్టిస్తూ…

72 కోట్ల ఇండస్ట్రీ రికార్డ్ నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది…బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా మొదటి రోజు ఇలాంటి కలెక్షన్స్ ని సాధించలేదు. కానీ ఇప్పుడు పుష్ప2 మూవీ ఎపిక్ కలెక్షన్స్ తో హిందీలో బిగ్గెస్ట్ డే 1 రికార్డ్ ను నమోదు చేసింది. నార్మల్ లాంగ్ వీకెండ్ లోనే ఇప్పుడు సినిమా….

మరిన్ని రికార్డుల భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….మిగిలిన మార్కెట్ లు ఎలా ఉన్నా కూడా హిందీ లో మాత్రం సినిమా లాంగ్ రన్ లో ఊహకందని రికార్డుల భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here