Home న్యూస్ పుష్ప2 హిందీ బుకింగ్స్…రికార్డ్ స్టార్ట్ తర్వాత ఇలా జరిగింది ఏంటి!!

పుష్ప2 హిందీ బుకింగ్స్…రికార్డ్ స్టార్ట్ తర్వాత ఇలా జరిగింది ఏంటి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా మీద ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా, మొదటి నుండి కూడా సినిమా మీద నార్త్ మార్కెట్ లో క్రేజ్ మరో లెవల్ లో ఉంది…అక్కడ హైప్ మరో లెవల్ లో ఉండటం వలనే…క్రేజ్ మరో లెవల్ కి వెళ్ళింది.

ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ రీసెంట్ గా స్టార్ట్ అవ్వగా ముందు సాలిడ్ క్రేజ్ ఉన్న హిందీ మార్కెట్ లోనే సినిమా బుకింగ్స్ ను ఓపెన్ చేశారు…ఇలా ఓపెన్ చేశారో లేదో రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించిన సినిమా ఊపు చూసి అందరూ కూడా ఇక…

బాలీవుడ్ లో బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్స్ ని క్రాస్ చేసి కొత్త బెంచ్ మార్క్ ని సైతం నమోదు చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు…కానీ రెండో రోజు నుండి చూసుకుంటే సినిమా బుకింగ్స్ ట్రెండ్ లో స్టడీగా డౌన్ ట్రెండ్ కనిపిస్తూ వెళ్ళింది….

దాంతో ముందు మొదటి రోజు లెక్క 70 కోట్ల రేంజ్ దాకా వెళుతుంది అన్న ఆశలతో స్టార్ట్ అవ్వగా రోజులు గడుస్తున్నా బుకింగ్స్ ట్రెండ్ స్టడీగా ఉన్నా మరీ మొదటి రోజు లెవల్ లో జోరుని అందుకోకపోవడంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో…

ఓవరాల్ గా 52-55 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ దిశగా సినిమా ఓపెనింగ్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. నార్మల్ వర్కింగ్ డే లో రిలీజ్ అవుతూ ఉండటం, హిందీలో గురువారం రిలీజ్ లు చాలా తక్కువె ఉండటం లాంటివి కూడా ఇంపాక్ట్ చూపించాయి…

అయినా కూడా ఓవరాల్ గా హిందీలో డబ్ అయిన మూవీస్ లో రికార్డులను అందుకోవడానికి సిద్ధం అవుతున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే మాస్ సెంటర్స్ లో జోరు చూపించి అంచనాలను మించే ఛాన్స్ ఉంది, అలా జరిగితే 60 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవచ్చు. మరి ఏం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here