బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి నుండి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా మీద హిందీలో విపరీతమైన అంచనాలు ఉండగా….ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు ఊహకందని రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…
సౌత్ నుండి హిందీలో డబ్ అయిన మూవీస్ పరంగానే కాకుండా ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన పుష్ప2 మూవీ హిస్టారికల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది… సినిమా మొదటి రోజు హిందీలో ఓవరాల్ గా 72 కోట్ల రికార్డ్ బ్రేకింగ్ నెట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుని ఊచకోత కోసిన తర్వాత రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా హిందీలో కాకుండా మిగిలిన చోట్ల హెవీ రేట్స్ వలన డ్రాప్స్ ఎక్కువగా సొంతం చేసుకున్నా కూడా హిందీ వర్షన్ మాత్రం రిమార్కబుల్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉంది ఇప్పుడు…
హిందీలో సినిమా రెండో రోజు నార్మల్ వర్కింగ్ డే లో సెన్సేషనల్ హోల్డ్ తో ఇప్పుడు 45-48 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించిపొతే మొదటి రోజు ఏకంగా 50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని…
అందుకునే అవకాశం ఉండగా రెండు రోజుల్లో హిందీలో 120 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోబోతుంది. మిగిలిన వర్షన్ లు పుంజుకుంటే ఓవరాల్ గా రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఉన్న సినిమా హిందీలో లాంగ్ రన్ లో భారీ రికార్డులతో భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.