బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) అన్ని చోట్లా మాస్ రచ్చ చేయగా సినిమా హిందీలో సాధిస్తున్న కలెక్షన్స్ అన్ని చోట్ల కలెక్షన్స్ ని ఔట్ పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా ఇతర చోట్ల కలెక్షన్స్ తక్కువగా అనిపిస్తున్నాయి.
సినిమా ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు సినిమాల పరంగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా పక్క రాష్ట్రం కర్ణాటకలో రిమార్కబుల్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని ఆల్ రెడీ దాటేసి మంచి లాభాలతో దూసుకు పోతూ ఉండగా ఇక్కడ లాభాలు ఓ రేంజ్ లో సొంతం చేసుకుంటూ ఉండటం ఒకెత్తు అయితే…
మరో పక్క సినిమా కన్నడ లో డబ్ అయిన మూవీస్ పరంగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఏకంగా అక్కడ డబ్ అయిన మూవీస్ పరంగా ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ ని నమోదు చేసింది…ఇది వరకు కన్నడలో డబ్ అయిన మూవీస్ పరంగా జైలర్ మూవీ 5.7 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంటే…
తర్వాత సలార్ మూవీ ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి అక్కడ ఫస్ట్ 6 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్న సినిమాగా నిలిచి టోటల్ రన్ లో 6.2 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా…ఈ రికార్డ్ ను ఈ ఇయర్ వచ్చిన కల్కి మూవీ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. టోటల్ రన్ లో కన్నడ డబ్ లో…
ఫస్ట్ 7 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న మూవీగా సంచలనం సృష్టించింది ఇప్పుడు….ఇక ఇప్పుడు పుష్ప2 మూవీ ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 7.6 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని అక్కడ లాంగ్ రన్ లో…
8 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోబోతున్న ఫస్ట్ కన్నడ డబ్ మూవీ గా నిలవబోతుంది…ఎపిక్ కలెక్షన్స్ తో అక్కడ దుమ్ము లేపుతున్న పుష్ప2 మూవీ లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తుందో చూడాలి. ఇక లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.