బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉన్నప్పటికీ హిందీలో రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో హోల్డ్ చేస్తూ…తమిళ్ కన్నడలో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, మాస్ కమర్షియల్ మూవీస్ ని పెద్దగా చూడని…
ఓవర్సీస్ మార్కెట్ లో సైతం ఊహకందని రేంజ్ లో వసూళ్ళ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది….హిందీలో ఎపిక్ రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా కర్ణాటకలో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో సినిమా దూసుకు పోతుంది. ఇక తమిళ్ లో కూడా మంచి హోల్డ్ ని చూపెడుతున్న…
పుష్ప2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో డే 2 డ్రాప్ అయినా కూడా డే 3 మళ్ళీ కుమ్మడం స్టార్ట్ చేసింది… ఓవరాల్ గా సినిమా అన్ని చోట్లా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్నా కూడా ఒక్క చోట మాత్రం ఎందుకో దెబ్బ పడినట్లు తెలుస్తుంది…అదే కేరళ స్టేట్ లో….అక్కడ అల్లు అర్జున్ కి ఎక్స్ లెంట్ ఫాలోయింగ్ ఉంది…
సినిమా మీద ఎక్స్ పెర్టేషన్స్ ఓ రేంజ్ లో ఉండటంతో తెలుగు సినిమాల్లో ఏ సినిమాకి రాని ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి అక్కడ…కానీ రెండో రోజు నుండే సినిమా సాలిడ్ గా డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయింది….మూడో రోజు కూడా పెద్దగా తేరుకోలేక పోయిన సినిమా 4 రోజుల వీకెండ్ లో 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటుందని అంచనా….
కేరళలో సినిమా ఓవరాల్ వాల్యూ బిజినెస్ 20 కోట్ల దాకా ఉండగా అది రికవరీ అవ్వాలి అంటే 56-60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేయాల్సి ఉంటుంది… సినిమాలో ఫహాద్ ఫాజిల్ ని అనుకున్న రేంజ్ లో చూపించక పోవడం అక్కడ కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేయడానికి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు…
కారణాలు ఏవి అయినా కూడా ప్రపంచం అంతా కలెక్షన్స్ జాతర సృష్టిస్తున్న పుష్ప2 కేరళ లో మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది.. .ఇక లాంగ్ రన్ లో సినిమా వాల్యూ బిజినెస్ లో ఎంతవరకు రికవరీ చేయగలుగుతుందో చూడాలి ఇప్పుడు…