ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా ఆల్ రెడీ అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి….ఆ అంచనాలను ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్స్ గా దూసుకు పోతూ మొదటి పార్ట్ కి మించి రచ్చ చేయబోతున్నాయి…
లేటెస్ట్ గా సినిమా నుండి వచ్చిన ఐటెం సాంగ్ ఓ రేంజ్ లో ఆడియన్స్ ను అలరించి సౌత్ రికార్డుల బెండు తీసింది….ఇక లేటెస్ట్ గా సినిమా నుండి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు…పీలింగ్స్(#Peelings #Pushpa2TheRule Lyrical Song) పేరుతో వచ్చిన ఈ సాంగ్…
ఆల్ రెడీ చిన్న ప్రోమోతోనే ఓ రేంజ్ లో కుమ్మేసింది. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ తో పాటు 1 నిమిషం వీడియో ఫుటేజ్ ను కూడా కలిపి రిలీజ్ చేయగా సాంగ్ ఇన్ స్టంట్ గా ఎక్కేయడమే కాకుండా అల్లు అర్జున్-రష్మికల మాస్ స్టెప్స్ కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి అని చెప్పాలి.
సాంగ్ లో విజువల్స్ మరీ అద్బుతం కాకపోయినా సింపుల్ సెట్స్ తో ఆకట్టుకోగా అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ కూడా బాగా మెప్పించాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇన్ స్టంట్ గా ఎక్కేసి సాంగ్ బాగుంది అనిపించేలా ఆకట్టుకుంది…
సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని పాటలు కూడా బాగా మెప్పించగా ఇప్పుడు పీలింగ్స్ సాంగ్ కూడా మిగిలిన సాంగ్స్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో మెప్పించడంతో, సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి అని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే రికార్డుల జాతర ఖాయమని చెప్పొచ్చు.