Home న్యూస్ పుష్ప2 ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

పుష్ప2 ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0
Pushpa 2 The Rule Premieres Review and Talk
Pushpa 2 The Rule Premieres Review and Talk

వరల్డ్ వైడ్ గా ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఆడియన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. ముందుగా స్పెషల్ ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి…

ఫస్ట్ టాక్ ఇప్పుడు ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారగా ప్రీమియర్స్ ఓవరాల్ ఇనీషియల్ టాక్ బాగానే ఉందని చెప్పాలి. సినిమా కథ పాయింట్ ఏమి రివీల్ చేయడం లేదు కానీ మొదటి పార్ట్ ఎండ్ ఎండ్ నుండి మొదలు అయ్యే పార్ట్ 2 లో పుష్ప ఎలా మరింతగా ఎదిగాడో అన్నది చూపెడుతూ..

కథ మొదలు అయ్యి తర్వాత తన విలన్స్ సరైన టైం కోసం ఎదురుచూస్తూ ఉండగా అలాంటి టైం వచ్చిన తర్వాత పుష్ప కి ఎదురుదెబ్బ తగులుతుంది…ఆ ఎదురుదెబ్బ తర్వాత తను ఎలా తిరిగి అనుకున్నది సాధించాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

ఇది మెయిన్ పాయింట్ అయినా కూడా సినిమాలో ఇంకా అనేక లేయర్స్ ఉండగా అవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…ఫస్ట్ ఫ్రేమ్ నుండే సుక్కు అల్లు అర్జున్ ల మ్యాజిక్ మొదలు అవ్వగా…ఫస్టాఫ్ అంతా కూడా ఎక్కడా టెంపో తగ్గకుండా రాంపెజ్ కొనసాగింది అని చెప్పొచ్చు…

కథ పాయింట్ పెద్దగా కొత్తదనం ఏమి ఉండదు, ఇది ఫక్తు కమర్షియల్ మూవీ..ఇది ముందే ఆడియన్స్ గుర్తు పెట్టుకుని సినిమా చూడాలి….అలా చూస్తె హీరో మాస్ ఎలివేషన్ లు, ఎక్స్ లెంట్ యాక్షన్ సీన్స్, కొన్ని చోట్ల గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ తో సినిమా ఆకట్టుకుంటుంది…

అదే టైంలో పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకోగా…సినిమా లెంత్ ఒక్కటి మాత్రం మరీ ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుందని…ఫస్టాఫ్ అయ్యే సరికి ఒక సినిమా చూసిన ఫీలింగ్ కలగగా సెకెండ్ ఆఫ్ కూడా మరో పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలగడం లాంటివి డ్రా బ్యాక్స్ అయినా కూడా…

చాలా వరకు అంచనాలను అందుకునే కంటెంట్, ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ తో నిండిన పుష్ప2 మూవీ మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకునే అవకాశం ఉందని చెప్పాలి.ఇక సెకండ్ ఆఫ్ లో వచ్చే జాతర సీన్ ఒక్కటి టికెట్ డబ్బులకు వర్త్ అనిపించేలా మెప్పించింది.. అదే టైంలో రెగ్యులర్ ఆడియన్స్ కొంచం ఓపికతో చూస్తె ఓవరాల్ గా డీసెంట్…

కమర్షియల్ మూవీగా పుష్ప2 ఉంటుంది అని చెప్పొచ్చు…కొంచం లెంత్ తగ్గించి ఉంటే సినిమా ఇంకా బాగా ఇంప్రెస్ చేసేది అని ఆడియన్స్ నుండి టాక్ వినిపిస్తుంది…ఓవరాల్ గా ప్రీమియర్స్ అయిన తర్వాత సినిమా కి ఫస్టాఫ్ ఎబో యావరేజ్ రేంజ్ లో…సెకెండ్ ఆఫ్ ఎబో యావరేజ్ టు హిట్ రేంజ్ లో అనిపించినా…

క్లైమాక్స్ సీన్ ఇంపాక్ట్ వలన ఓవరాల్ గా సినిమా ఎబో యావరేజ్ టు హిట్ రేంజ్ లో అనిపించింది….సినిమా మీద ఉన్న హైప్ కి ఈ టాక్ సరిపోతుంది…ఇక రెగ్యులర్ షోల టైంకి సినిమా కి కామన్ ఆడియన్స్ నుండి ఈ రేంజ్ టాక్ లేక ఇంతకన్నా బెటర్ టాక్ వస్తే ఇక బాక్స్ ఆఫీస్ జాతర ఖాయమని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here