పుష్ప అనే సినిమా ఒక నార్మల్ కమర్షియల్ మాస్ మూవీ….తెలుగు రాష్ట్రాల్లో అప్పటి పరిస్థితులలో అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయింది, అయినా కూడా ఇతర భాషల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది…అలాంటి సినిమాకి సీక్వెల్ అయిన పుష్ప2(Pushpa2 The Rule) మీద ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా తో పాటు…
ఓవర్సీస్ లో కూడా విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి…అది రికార్డులను అన్నీ కూడా బ్రేక్ చేసే రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి. బిజినెస్ పరంగా ఆల్ రెడీ ఎపిక్ రికార్డ్ ను సొంతం చేసుకున్న పుష్ప2 సినిమా 617 కోట్ల బిజినెస్ తో దుమ్ము దుమారం లేపింది…
ఇక ఇప్పుడు రిలీజ్ పరంగా కూడా అన్ని చోట్లా సంచలనం సృష్టిస్తూ రికార్డ్ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది…సినిమా నైజాంలో సుమారు 450 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఆంద్ర సీడెడ్ లు కలిపి 1000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది…
ఇక వరల్డ్ వైడ్ గా కూడా రికార్డ్ లెవల్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప2 థియేటర్స్ కౌంట్ అంచనా లెక్కలను గమనిస్తే…
Pushpa 2 The Rule WW Theaters Count(Approx)
👉Nizam – 450+
👉Total AP- 1000+
APTG Total – 1450~
👉Ka- 300+
👉Tamilnadu – 580~
👉Kerala – 330~
👉Hindi & ROI- 4350~
Total India – 7010~
👉OS – 3400~
Total WW – 10400+
ఓవరాల్ గా వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ లెక్క అంచనాలను మించిపోయే రేంజ్ లో ఉండగా టోటల్ స్క్రీన్ కౌంట్ మేకర్స్ అనుకున్నట్లే 12 వేలకు పైగా ఉంటాయని అంచనా….ఓవరాల్ గా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో రిలీజ్ అవుతున్న పుష్ప2 మూవీ ఇక కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి…