ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ క్రేజ్ నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పుష్ప 2 ది రూల్(Pushpa 2 The Rule Movie) హ్యుమంగస్ క్రేజ్ నడుమ రిలీజ్ కానుండగా టాక్ మినిమమ్ పాజిటివ్ గా ఉన్నా కూడా పాన్ ఇండియా రేంజ్ లో…
బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో ఎపిక్ రికార్డులు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా మీద ఉన్న అంచనాలను మరింత పెంచడానికి ఇప్పుడు సినిమా నుండి అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు… భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న సినిమా ట్రైలర్…
ఈ 17న సాయంత్రం రిలీజ్ కాబోతూ ఉండగా ఫ్యాన్స్ అందరూ భారీ ఎత్తున ఈ ట్రైలర్ తో రికార్డుల జాతర సృష్టించాలని చూస్తున్నారు….సినిమా ట్రైలర్ ల విషయంలో టాలీవుడ్ లో కొన్ని సినిమాలు కొత్త రికార్డులు నమోదు చేయగా ఇప్పుడు పుష్ప2 ట్రైలర్ ఆ రికార్డులను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.
టాలీవుడ్ ట్రైలర్స్ లో ఎక్కువగా చూసే ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ విషయంలో సలార్ ట్రైలర్ 3 నిమిషాల్లో ఈ రికార్డ్ కొట్టగా భీమ్లా నాయక్ 4 నిమిషాల టైంకి ఈ రికార్డ్ ను అందుకుని టాప్ 2 ప్లేసులలో నిలిచాయి. ఇక 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా టాలీవుడ్ ట్రైలర్స్ లో…
గుంటూరు కారం ట్రైలర్ 37.68 మిలియన్ వ్యూస్ ని అందుకోగా రెండో ప్లేస్ లో సలార్ 32.58 మిలియన్ వ్యూస్ తో టాప్ 2 ప్లేసులలో నిలిచాయి. ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ విషయంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ 1.24M మిలియన్ లైక్స్ ను అందుకోగా సలార్ ట్రైలర్ 1.238M మిలియన్ లైక్స్ తో…
టాప్ 2 ప్లేసులలో నిలిచాయి..ఇక సౌత్ టాప్ రికార్డుల పరంగా గుంటూరు కారం వ్యూస్ పరంగా టాప్ లో ఉంటే లైక్స్ పరంగా లియో మూవీ ట్రైలర్ 2.64 మిలియన్ లైక్స్ తో టాప్ లో ఉంది…ఓవరాల్ గా ఈ రికార్డులను పుష్ప2 కనుక బ్రేక్ చేస్తే సినిమా మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మరోసారి క్లియర్ అవుతుంది. ఇక సినిమా ట్రైలర్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.