ఊహకందని అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రికార్డ్ రిలీజ్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధం అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా, రికార్డుల జాతర అన్ని ఏరియాల్లో సృష్టించడానికి సిద్ధం అవుతూ ఉండగా…
అన్ని చోట్లా సినిమా మీద అంచనాలు ఓ లెవల్ లో ఉన్నప్పటికీ హిందీ మార్కెట్ లో మాత్రం క్రేజ్ మరో లెవల్ లో ఉందని చెప్పాలి ఇప్పుడు, అక్కడ సినిమా మీద ఎక్స్ పెర్టేషన్స్ ముందు నుండే విపరీతంగా ఉండగా, ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ అక్కడ ఓపెన్ అయిన తీరు…
అలాగే రికార్డుల బెండు తీస్తూ సాగుతున్న సినిమా బుకింగ్స్ ట్రెండ్ చూస్తూ ఉంటే బాలీవుడ్ లో మొదటి రోజున సినిమా రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…కాగా ప్రజెంట్ బాలీవుడ్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ డే 1 రికార్డ్ హోల్డర్ గా…
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్(Jawan Movie) మొదటి రోజు 65.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది…ఇక రెండో ప్లేస్ లో శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ2 సినిమా ప్రీమియర్స్ డే 1 కలెక్షన్స్ తో కలిపి 64.80 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుని టాప్ 2 ప్లేస్ లో నిలిచింది. ఇప్పుడు పుష్ప2 మూవీ బుకింగ్స్ ట్రెండ్ ఊపు చూస్తూ ఉంటే అవలీలగా ఈ రికార్డ్ కలెక్షన్స్ ట్రెండ్ కి బ్రేక్ పడే అవకాశం కొత్త బెంచ్ మార్క్ నమోదు అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా మొదటి రోజు 70 కోట్ల రేంజ్ లో…
నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే ఛాన్స్ ఎంతైనా ఉండగా, టాక్ బాగుండి మాస్ సెంటర్స్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తే మొదటి రోజు 75 కోట్ల మార్క్ ని అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు….మొత్తం మీద బాలీవుడ్ గడ్డ మీద అల్లు అర్జున్ రికార్డుల జాతర సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు….