పెద్ద పెద్ద సినిమాలకు పెట్టిన పెద్ద బడ్జెట్ రికవరీ అవ్వాలి అంటే అదే రేంజ్ లో బిజినెస్ అండ్ కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది….అలాంటి కలెక్షన్స్ రావాలి అంటే ఊహకందని లాంగ్ రన్ తో పాటు భారీ టికెట్ హైక్స్ కూడా అవసరం అని చెప్పాలి…టాలీవుడ్ లో రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ నటించిన సినిమాలలో…
భారీ టికెట్ హైక్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా ఎన్టీఆర్(Jr NTR) నటించిన దేవర(Devara Part 1) నిలిచింది….కానీ ఇప్పుడు ఆ సినిమా రేట్స్ ను కూడా మించి పోయే రేంజ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా…
టికెట్ హైక్స్ మరో లెవల్ కి వెళ్ళిపోయాయి….నైజాంలో సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేటు 350 వరకు ఉండగా మల్టీప్లెక్సులలో రేటు ఏకంగా 500 నుండి 530 వరకు వెళ్ళాయి….రీసెంట్ బిగ్ మూవీస్ రేట్స్ మీద ఇది ఆల్ మోస్ట్ 70-90 వరకు ఎక్కువ రేటు అనే చెప్పాలి.
ఇక ఆంధ్రలో సినిమాకి సింగిల్ స్క్రీన్స్ లో 300 వరకు రేటు, మల్టీప్లెక్సులలో 400 కి పైగా రేటు ఉంది. రీసెంట్ బిగ్ మూవీస్ మీద ఏకంగా 80-100 రేటు ఎక్కువ అనే చెప్పాలి. ఈ రేంజ్ రేట్స్ అంటే సినిమాకి టాక్ ఎలా ఉన్నా మొదటి రోజు రికార్డుల రచ్చ ఖాయమని చెప్పాలి…
ప్రజెంట్ టాలీవుడ్ లో బిగ్గెస్ట్ షేర్ ని మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న సినిమాలను గమనిస్తే…
AP TG 1st Day Highest Share Movies
1. #RRR – 74.11CR
2. #Devara part 1 – 61.65CR
3. #SALAAR- 50.49CR
4. #Kalki2898AD – 44.86CR
5. #Baahubali2- 43CR
ఇప్పుడు పుష్ప2 సాధించిన బిజినెస్ వచ్చిన టికెట్ హైక్స్ చూస్తూ ఉంటే మొదటి రోజు…
మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ డే 1 రికార్డ్ ను అవలీలగా బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఈ రేట్స్ వీకెండ్ మొత్తం ఉండబోతూ ఉండటంతో వీకెండ్ వసూళ్లు ఊహకందని రేంజ్ లో ఉండబోతున్నాయి. ఇక సినిమాకి టాక్ కూడా బాగుంటే ఇక రికార్డుల జాతర మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.