Home న్యూస్ రాయన్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

రాయన్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0
Dhanush Raayan Movie Telugu Review and Rating
Dhanush Raayan Movie Telugu Review and Rating

కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie Telugu Review) ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద మంచి బజ్ ఏర్పడగా ఇప్పుడు గ్రాండ్ గా రిలీజ్ అయిన రాయన్ ధనుష్ కి అటు హీరోగా ఇటు డైరెక్టర్ గా ఎలాంటి పేరు తెచ్చిపెట్టిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే తన వాళ్ళ కోసం పోరాటాలు చేయడానికి కూడా సిద్ధం అయ్యే హీరో మనుషులు అనుకోకుండా విలన్ గ్యాంగ్ తో గొడవ పడటంతో హీరో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇక ఆ తర్వాత హీరోకి పొలిటికల్ అండ్ రౌడీల మధ్య పోటిలో ఎవరు గెలిచారు అన్నది కథ పాయింట్…

కథ పాయింట్ పరంగా తిన్ స్టోరీ పాయింట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది…పెర్ఫార్మెన్స్ పరంగా హీరోగా అండ్ డైరెక్టర్ గా ధనుష్ బాగానే న్యాయం చేశాడు కానీ డైరక్టర్ గా ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనిపించింది…తన రోల్ అండ్ పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ కథ పాయింట్ చాలా రొటీన్ గా ఉండటంతో….

పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ కథలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నాడు, ఫస్టాఫ్ లో స్టార్టింగ్ అండ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ మినహా మిగిలిన కథ చాలా నెమ్మదిగా సాగుతుంది….దాంతో చూస్తున్న ఆడియన్స్ కొంచం బోర్ ఫీల్ అవుతున్న వేల ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి ఊపునిచ్చి…

సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా ఫస్టాఫ్ తో పోల్చితే సెకెండ్ ఆఫ్ హీరో విలన్ ల మధ్య పోటాపోటీ సీన్స్ తో, ఎమోషనల్ సీన్స్ తో బాగా మెప్పించి క్లైమాక్స్ పర్వాలేదు అనిపించేలా ఉంటుంది. ఫస్టాఫ్ ను ఇంకా బెటర్ గా డీల్ చేసి ఉంటే ఇంకా బాగుండేది…

ధనుష్ మరోసారి ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ తో కుమ్మేశాడు. హీరోయిజం ఎలివేట్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ రఫ్ఫాడించాడు…ఇక ఎస్ జే సూర్య తన రోల్ కి ఫుల్ న్యాయం చేశాడు, ధనుష్-ఎస్ జే సూర్యల సీన్స్ చాలా బాగా వచ్చాయి…..ఇక సందీప్ కిషన్ కూడా ఉన్నంతలో తన రోల్ తో మెప్పించగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించారు…. సంగీతం సో సోగానే ఉన్నా కూడా..

బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో రెహమాన్ తన మార్క్ ని చూపించి కుమ్మేశాడు….. కొన్ని సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో చాలా వీక్ గా అనిపించింది…. సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. డైరెక్షన్ పరంగా…

ధనుష్ పర్వాలేదు అనిపించాడు కానీ తన 50వ సినిమా అంటే ఉండే హైప్ కి ఫుల్ న్యాయం అయితే చేయలేదు,కానీ కొన్ని సీన్స్ ను చాలా బాగా తీయడంతో థియేటర్స్ లో చూస్తున్న టైంలో కొన్ని సీన్స్ బోర్ అనిపించినా కొన్ని చోట్ల మాత్రం మంచి సీన్స్ తో తిరిగి కూర్చుని చూసేలా చేశాడు ధనుష్…

మొత్తం మీద ఫస్టాఫ్ యావరేజ్ గా సెకెండ్ ఆఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించిన రాయన్ మూవీ ఓవరాల్ గా కొన్ని మంచి సీక్వెన్స్ అండ్ గుడ్ సెకెండ్ ఆఫ్ కోసం ఈజీగా చూడొచ్చు, కథ రొటీన్ గానే అనిపించినా కూడా ఓవరాల్ గా మూవీ అయ్యే టైంకి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా ధనుష్-ఎస్ జే సూర్య ల కోసం ఈజీగా ఒకసారి చూసేయోచ్చు… మొత్తం మీద సినిమాకి మారేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here