Home న్యూస్ ధనుష్ “రాయన్” తెలుగు బిజినెస్….క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

ధనుష్ “రాయన్” తెలుగు బిజినెస్….క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

0
Dhanush Raayan Movie Telugu States Business And Break Even Target
Dhanush Raayan Movie Telugu States Business And Break Even Target

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సార్ మూవీతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న ధనుష్(Dhanush) ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి మార్కెట్ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ మూవీ…

సంక్రాంతికి రిలీజ్ అవ్వగా పోటిలో పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించలేక పోయిన సినిమా ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమా రిజల్ట్ తర్వాత ధనుష్ కెరీర్ లో ఇప్పుడు ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie Telugu Business) ఇప్పుడు…

ఆడియన్స్ ముందుకు పాన్ ఇండియా రేంజ్ లో ఈ నెల 26న రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా మీద డీసెంట్ బజ్ ఉండగా ట్రైలర్ మాస్ కంటెంట్ తో బాగానే ఆకట్టుకోవడంతో పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఎక్స్ పెర్టేషన్స్ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా….

బిజినెస్ కూడా డీసెంట్ గానే జరిగింది. కెప్టెన్ మిల్లర్ మూవీ 4 కోట్ల రేంజ్ లో రేటుని అందుకోగా ఇప్పుడు రాయన్ మూవీ కి 5 కోట్ల రేంజ్ లోపు వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం. దాంతో తెలుగు లో సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే…

మొత్తం మీద 5.50 కోట్ల రేంజ్ లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఈ వీక్ లో పెద్దగా పోటి ఇచ్చే సినిమాలు లేక పోవడంతో సోలో రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న రాయన్ మూవీ టాక్ బాగుంటే తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here