పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చి జనవరి 14 న రిలీజ్ అవ్వాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. అప్పటి నుండి ఆ డేట్ కి తగ్గ ప్లానింగ్ లోనే ఉన్నారు టీం.
కానీ రిలీజ్ కి ఇంకో రెండు వారాలు మాత్రమే టైం ఉన్న టైం లో అనుకోకుండా కేసులు పెరుగుతూ ఉండటంతో ఇతర రాష్ట్రాలలో ఇబ్బందుల వలన ఆంధ్రలో లో టికెట్ రేట్స్ వలన ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ ను ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకోవాల్సి రాగా…
రాధే శ్యామ్ కూడా పాన్ ఇండియా మూవీనే కాబట్టి ఈ సినిమా కూడా రిలీజ్ పోస్ట్ పోన్ కానుంది అంటూ వార్తలు శిఖారు కొట్టగా సినిమా యూనిట్ దీనిపై అఫీషియల్ గానే మీడియాకి ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. మేం ఇప్పటికీ అనుకున్న డేట్ అయిన జనవరి 14 నే…
థియేటర్స్ కి రావడానికి సిద్ధం అవుతున్నామని, ఆ డేట్ కే పరిస్థితులు మరీ అదుపు తప్పితే తప్ప కచ్చితంగా ఆ డేట్ కి ఆడియన్స్ ముందుకు సినిమాను తీసుకు వస్తాము అంటూ చెప్పుకొచ్చారు. దాంతో పండక్కి ఆల్ ఇండియా లెవల్ లో ఉన్న థియేటర్స్ లో ఇప్పటి నుండి అప్పటి వరకు మరిన్ని ఇబ్బందులు రాకుండా ఉంటే రాధే శ్యామ్ కలెక్షన్స్ పరంగా…
కుమ్మేయడం ఖాయమని చెప్పొచ్చు, కానీ అదే టైం లో కేసులు అన్ని చోట్లా ఇంకా పెరిగేలా ఉన్న నేపధ్యం లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో అన్నది ఎవ్వరి చేతిలో లేదనే చెప్పాలి. మరి అప్పటికి పరిస్థితులు విషమించకుండా సజావుగా రాధే శ్యామ్ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ ఇండియా లెవల్ లో కలెక్షన్స్ జాతర చేయాలని కోరుకుందాం.