బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా మరీ అద్బుతం అనిపించుకోకున్నా కానీ ఉన్నంతలో సినిమా జానర్ అండ్ టాక్ దృశ్యా మంచి వసూళ్ళనే సొంతం చేసుకుని 2022 ఇండియన్ మూవీస్ పరంగా మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా సంచలనం సృష్టించి దుమ్ము దుమారం లేపింది కానీ ఇదే టైం లో…
సినిమా కి ఓవర్సీస్ లో రికార్డ్ బ్రేకింగ్ అనిపించేలా రిలీజ్ ను ప్లాన్ చేశారు మేకర్స్… కానీ సినిమా ప్రింట్స్ కొంచం ఆలస్యం అవ్వగా అక్కడ ఓవరాల్ గా కలెక్షన్స్ రెస్పాన్స్ మాత్రం యావరేజ్ అనిపించేలానే సొంతం చేసుకుంది రాధే శ్యామ్ సినిమా… ఓవరాల్ గా…
అమెరికాలో రాధే శ్యామ్ సినిమా ప్రీమియర్స్ అలాగే మొదటి రోజు మొత్తం కలిపి 1.23 మిలియన్ డాలర్స్ ని మాత్రమే సొంతం చేసుకుని జస్ట్ ఓకే అనిపించుకుంది అంతే….. కానీ ఇదే టైం లో నార్మల్ రీజనల్ రీమేక్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మాత్రం అమెరికాలో ప్రీమియర్స్ అలాగే…
మొదటి రోజు కలెక్షన్స్ తో ఏకంగా 1.32 మిలియన్ డాలర్స్ ని సొంతం చేసుకుంది. భీమ్లా నాయక్ కంటే కూడా ఆల్ మోస్ట్ డబుల్ లోకేషన్స్ లో రాధే శ్యామ్ సినిమా రిలీజ్ అవ్వగా కలెక్షన్స్ పరంగా మాత్రం అక్కడ ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ పరంగా ఈ ఇయర్ కి గాను భీమ్లా నాయక్ పేరిట ఉన్న రికార్డ్ ను అందుకోలేక పోయింది…
ఇదే టైం లో జస్ట్ రీమేక్ మూవీ తోనే పవన్ కళ్యాణ్ అమెరికాలో తన పేరిట ఉన్న రికార్డ్ ను ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ వచ్చే వరకు కూడా కొనసాగించబోతుండటం విశేషం అని చెప్పాలి. ఇక రాధే శ్యామ్ మూవీ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకా గట్టిగా హోల్డ్ చేసి లాంగ్ రన్ లో ఇంకా సాలిడ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది…