పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ రాధే శ్యామ్ ఈ ఇయర్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా, కానీ ఎప్పటికప్పుడు అనుకోని కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టి పరిస్థితులలో కూడా జనవరి 14న సంక్రాంతి కానుక గా…
ఆడియన్స్ ముందుకు రావడం ఖాయమని డేట్ ని ఫిక్స్ ఎప్పుడో చేశారు, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ లు సంక్రాంతికి అనౌన్స్ చేసినా రాధే శ్యామ్ తగ్గలేదు, ఏకంగా ఆర్ ఆర్ ఆర్ రేసులోకి ఎంటర్ అయినా కానీ రాధే శ్యామ్ రిలీజ్ డేట్ అదే ఫిక్స్ చేశారు మేకర్స్…
కానీ సడెన్ గా 3rd ఎఫెక్ట్ మొదలు అవ్వడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందుగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోగా రాధే శ్యామ్ మాత్రం చివరి నిమిషం వరకు జనవరి 14న రిలీజ్ కే సిద్ధం అయ్యింది కానీ కొత్తగా తమిళనాడులో థియేటర్స్ ని మూసెయ్యడం, కర్ణాటకలో 50% ఆక్యుపెన్సీ పెట్టడం…
మరికొన్ని చోట్ల థియేటర్స్ పై ఆంక్షలు పెట్టడం అమెరికాలో రోజుకి 1 మిలియన్ కేసులు నమోదు అవుతూ ఉండటం లాంటివి చూసి ఇక తప్పక సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నాం అంటూ అఫీషియల్ గా రీసెంట్ గా అప్ డేట్ చేశారు. దాంతో పాటే రీసెంట్ గా సినిమా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అవుతుంది అన్న వార్తలకు ఇన్ డైరెక్ట్ గా జవాబు చెబుతూ…
సినిమా పరిస్థితులు సెట్ అయ్యాక థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు, దాంతో సినిమా డిజిటల్ రిలీజ్ పై డౌట్స్ చాలా వరకు క్లియర్ అయ్యాయి అని చెప్పాలి. మొత్తం మీద సంక్రాంతికి 2 పాన్ ఇండియా మూవీస్ తో ఆల్ ఇండియా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనుకుంటే 3rd వేవ్ దెబ్బతో పరిస్థితులు అన్నీ మారిపోయాయి…