బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ ని అందరూ సూపర్ సాలిడ్ గా మొదలు పెట్టాలని రూల్ లేదు, అలాగే కెరీర్ కొనసాగాలని రూల్ లేదు, బ్యాగ్రౌండ్ ఏమి లేకుండా టాలీవుడ్ లో వరుస విజయాలతో ఎంటర్ అయ్యి హాట్రిక్ విజయాలను నమోదు చేసి మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదురుకుంటున్నాడు. కెరీర్ మొదలు పెట్టడం సాలిడ్ విజయాలతో మొదలు పెట్టిన…
రాజ్ తరుణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ, కుమారి 21F లాంటి హాట్రిక్ విజయాలను నమోదు చేయగా తర్వాత ఈడోరకం ఆడోరకం అంటూ మంచు విష్ణుతో కలిసి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నాడు. ఇక కెరీర్ లో…వెనుతిరిగి చూసుకోవాల్సిన…
అవసరం లేదు అనుకుంటూ వరుసగా వచ్చిన అవకాశాలను అన్నీ ఒప్పుకుంటూ పోయిన రాజ్ తరుణ్ అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవ్వడంతో ఇక తేరుకోలేడు అని అనుకుంటున్న టైం లో లాస్ట్ ఇయర్ ఒరేయ్ బుజ్జిగా సినిమా డిజిటల్ హిట్ గా నిలిచింది.
కానీ తర్వాత రాజ్ తరుణ్ చేసిన కొత్త సినిమా ఒకటి ఉందని కూడా తక్కువ మందికే తెలుసు. ఆ సినిమా ఒరేయ్ బుజ్జిగా తీసిన డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లోనే వచ్చిన పవర్ ప్లే రీసెంట్ గా రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తో మొదటి వీకెండ్ లోనే భారీ దెబ్బ కొట్టింది, మొదటి రోజు 6 లక్షలు, రెండో రోజు 4 లక్షల షేర్ ని…
మూడో రోజు 3 లక్షల షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా వీకెండ్ లో 13 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. అది కూడా డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ తీయకుండా చెప్పిన లెక్క, అవి కూడా తీసేస్తే మిగిలేది ఏమి ఉండదు, ఇలాంటి పరిస్థితి అద్బుతమైన స్టార్ట్ దక్కిన హీరోకి ఎదురు అవ్వడం విచారకరం. సినిమాను డిజిటల్ రిలీజ్ చేసినా బాగుండేది అంటున్నారు విశ్లేషకులు ఇప్పుడు..