బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ ఇండస్ట్రీ తిరిగి సెకెండ్ పాండమిక్ తర్వాత మళ్ళీ రెట్టించిన జోరు తో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఇతర ఇండస్ట్రీలను డామినేట్ చేస్తూ దూసుకు పోతూ ఉంది. ఈ ఇయర్ ఫస్ట్ వేవ్ తర్వాత ఓ రేంజ్ లో విజయాలను సొంతం చేసుకుని దుమ్ము లేపిన టాలీవుడ్ ఇండస్ట్రీ తర్వాత సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన పరిస్థితులు మళ్ళీ మొదటికి రావడం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల గొడవ జరుగునే ఉన్నా కానీ…
చిన్న సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అవుతూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ సత్తా చాటుకుంటున్నాయి. సెకెండ్ పాండమిక్ తర్వాత ఇండియా లో ఫస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న ఇండస్ట్రీ గా టాలీవుడ్ నిలవగా సెకెండ్ హిట్ కూడా మనమే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ రాజ రాజ చోర సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా 8 వ రోజు 24 లక్షలతో హోల్డ్ చేయగా 9 వ రోజు 21 లక్షల షేర్ ని అందుకుంది.
మొత్తం మీద ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 1.96Cr
👉Ceeded: 67L
👉UA: 52L
👉East: 34L
👉West: 20L
👉Guntur: 38L
👉Krishna: 21L
👉Nellore: 15L
Total AP TG: 4.43CR(7.65cr~ Gross)
👉KA+ROI: 12L
👉OS: 67L~
TOTAL Collections: 5.22CR(9.15CR~ Gross)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా టోటల్ బిజినెస్ 2.2 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 2.4 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా 9 రోజుల తర్వాత టోటల్ ప్రాఫిట్ 2.82 కోట్ల ప్రాఫిట్ తో బ్రేక్ ఈవెన్ మీద డబుల్ ప్రాఫిట్ ను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సెకెండ్ పాండమిక్ తర్వాత ఇండియా లో డబుల్ బ్లాక్ బస్టర్ అయిన మొదటి సినిమా రాజ రాజ చోరనే అవ్వడం విశేషం…