సెకెండ్ వేవ్ ఆల్ మోస్ట్ ఎండ్ కి చేరుకున్న టైం లో సినిమాలు చాలా వరకు థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం అవ్వాలని ఎదురు చూస్తున్న తరుణం లో ఆ సినిమాలను తమ వైపు తిప్పుకుని డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయించాలని OTT వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ కొన్ని సినిమాలు మాత్రమే వాళ్ళ చేతుల్లోకి వస్తున్నాయి. ఎక్కువ శాతం చిన్న సినిమాలే ఈ లిస్టు లో ఉండగా వాటిలో…
కొంచం బజ్ ఉన్న సినిమా అయితే చాలు OTT వాళ్ళు డీసెంట్ రేట్లు చెల్లించి హక్కులను సొంతం చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఇలానే టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు నటిస్తున్న కొత్త సినిమా రాజ రాజ చోర సినిమా రైట్స్ కూడా ఇప్పుడు సాలిడ్ రేటు కి అమ్ముడు పోయాయి.
సినిమా బడ్జెట్ మొత్తం మీద 3 కోట్ల లోపే ఉండగా సినిమా డిజిటల్ రైట్స్ ని జీ నెట్ వర్క్ వాళ్ళు 6.2 కోట్ల రేటు ని ఫైనల్ చేయగా అలాగే సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ అండ్ మ్యూజిక్ రైట్స్ అన్నీ కలిపి ఓవరాల్ గా అద్బుతమైన రేటు చెల్లించారట….
టోటల్ రేటు ఇప్పుడు అన్నీ కలుపుకుని 9 కోట్ల దాకా ఇచ్చి డీల్ ని క్లోజ్ చేశారాని ఇండస్ట్రీ లో స్ట్రాంగ్ టాక్ వినిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినా ఇంత షేర్ వస్తుందో లేదో అన్నది ఇప్పుడు అనుమానం అలాగే శాటిలైట్ రైట్స్ కూడా తక్కువ రేటే పలుకుతుంది. కానీ ఇక్కడ అన్ని రైట్స్ కలిపి టోటల్ గా రేటు ఇప్పుడు 9 కోట్లు రావడంతో….
మొత్తం మీద 3 కోట్ల బడ్జెట్ లో నిర్మాణం అయిన సినిమా కి ఏకంగా 6 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ లభించినట్లు అయింది ఇప్పుడు. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ కి సంభందించిన డీల్ కూడా జీ వాళ్ళతోనే జరుగుతుందని, అది కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉందని, అన్నీ కలిపి 10 కోట్ల రేంజ్ రేటు తో ఫిక్స్ చేయాలనీ చూస్తున్నారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.