Home గాసిప్స్ రాజశేఖర్@4 కోట్లు…ఇదెక్కడి మాస్ రా బాబు!!

రాజశేఖర్@4 కోట్లు…ఇదెక్కడి మాస్ రా బాబు!!

2305
0

బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా హిట్ కొట్టి ఆల్ మోస్ట్ 13 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటికీ స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న హీరో రాజ శేఖర్. టాలీవుడ్ సీనియర్ హీరోలలో ప్రస్తుతం హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న హీరోలలో రాజ శేఖర్ ముందు నిలుస్తారు. ఈ మధ్య గరుడ వేగ మరియు కల్కి లాంటి సినిమాలు పర్వాలేదు అనిపించినా కానీ బడ్జెట్ అండ్ బిజినెస్ లెక్కలు ఎక్కువ అవ్వడం తో…

బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం రెండూ కూడా నిరాశనే మిగిలించాయి. ఇలాంటి టైం లో మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ సినిమాను తెలుగు లో శేఖర్ పేరు తో రీమేక్ చేస్తుండగా ఈ సినిమా తో పాటు రీసెంట్ గా మరో సినిమాను కమిట్ అయ్యాడు రాజ శేఖర్…

యాక్షన్ హీరో గోపీచంద్ మరియు శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ లో కీలక పాత్ర పోషించబోతున్నారు రాజ శేఖర్, ముందు అన్నయ రోల్ అని టాక్ వచ్చినా తర్వాత అది నెగటివ్ రోల్ అని అంటున్నారు. ఇక ఈ సినిమా కి గాను రాజ శేఖర్…

రికార్డ్ లెవల్ లో రెమ్యునరేషన్ ని అందుకోబోతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ముందు 1.5 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అని టాక్ వచ్చినా కానీ ఏకంగా ఆ రేటు కి డబుల్ అనిపించుకునే లెవల్ లో 4 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని ఈ సినిమా కోసం రాజ శేఖర్ కి ఇవ్వడానికి మేకర్స్ ఒప్పుకున్నట్లు చెబుతున్నారు.

చాలా టైం తర్వాత కమర్షియల్ మూవీ చేస్తుండటం, అందునా నెగటివ్ టచ్ ఉన్న రోల్ అంటూ ఉండటం తో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ని అడగడం నిర్మాత ఓకే అనడం జరిగింది అంటూ వార్తలు శిఖారు చేస్తున్నాయి. రాజ శేఖర్ కి అయితే ఈ సినిమాతో బాగానే గిట్టుబాటు అయిందని, ఇక నిర్మాతలు రాజ శేఖర్ ని ఈ సినిమా కోసం ఏ రేంజ్ లో వాడుకుని కొత్త రాజ శేఖర్ ని ఆడియన్స్ ముందు పెడతారో చూడాలి అంటూ అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here