Home గాసిప్స్ ఓరినీ సెకెండ్ హీరో రోల్ అనుకుంటే…ఇలా షాకిచ్చారేంటీ!!

ఓరినీ సెకెండ్ హీరో రోల్ అనుకుంటే…ఇలా షాకిచ్చారేంటీ!!

21874
0

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఇప్పుడు ఫామ్ లో లేని హీరోలలో రాజ శేఖర్ కూడా ఒకరు. ఒకప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్ లో తన సత్తా చాటుకున్న రాజశేఖర్ తర్వాత టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు… ఎవడైతే నాకేంటి సినిమా హిట్ తర్వాత కొంత టైం కి మళ్ళీ గోరింటాకు సినిమా తో హిట్ కొట్టిన రాజ శేఖర్ తర్వాత టైం లో అసలు క్లీన్ హిట్ ని అందుకోలేదు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ని అందుకోని రాజ శేఖర్ రీసెంట్ టైం లో గరుడ వేగ మరియు కల్కి సినిమాలతో మెప్పించిన రెండు సినిమాలు బడ్జెట్ అండ్ బిజినెస్ పరంగా అంచనాలను అందుకోలేక ఫ్లాఫ్ మూవీస్ గా నిలిచాయి.

ఇలాంటి టైం లో కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రాజ శేఖర్ కి రీసెంట్ గా యాక్షన్ హీరో గోపీచంద్ మరియు శ్రీవాస్ ల కాంబినేషన్ లో లక్ష్యం మరియు లౌక్యం బ్లాక్ బస్టర్స్ తర్వాత కన్ఫాం అయిన హాట్రిక్ మూవీ లో సెకెండ్ హీరో రోల్ లో కనిపించబోతున్నారు అంటూ రీసెంట్ గా…

వార్తలు ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టగా ఇప్పుడు అది నిజం కాదని సాలిడ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.. ఈ సినిమా లో గోపీచంద్ అన్న రోల్ లో రాజ శేఖర్ నటించడం లేదని సినిమాలో విలన్ రోల్ లో రాజ శేఖర్ కనిపించబోతున్నారని అంటున్నారు ఇప్పుడు. అందుకోసమే ఈ సినిమా కి గాను భారీ రెమ్యునరేషన్ ని ఇప్పుడు…

రాజ శేఖర్ తీసుకోబోతున్నారు… కెరీర్ లో నికార్సయిన కంబ్యాక్ కోసం చూస్తున్న రాజ శేఖర్ నెగటివ్ రోల్ తోనే ఆ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్నారని, సినిమాలో రాజ శేఖర్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది అతి త్వరలోనే తెలుస్తుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here