Home న్యూస్ హిట్టు కొట్టి ఏళ్ళు అవుతుంది…ఈ సారి పక్కా!

హిట్టు కొట్టి ఏళ్ళు అవుతుంది…ఈ సారి పక్కా!

600
0

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది… అప్పుడెప్పుడో గోరింటాకు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నా కానీ తర్వాత ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ స్టేటస్ ను అయితే అందుకోలేక పోయింది. ఇలాంటి టైం లో గరుడ వేగ మరియు కల్కి లాంటి సినిమాలు ఆడియన్స్ మనసు గెలుచుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్ర్రం….

బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక పోయాయి. కానీ ఆ సినిమాలతో రాజశేఖర్ కి తిరిగి మార్కెట్ అయితే కొంచం ఏర్పడగా మరో మంచి ప్రయత్నంతో ఆడియన్స్ ముందుకు రావాలని ఎదురు చూసిన రాజశేఖర్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు శేఖర్ అనే సినిమా తో రావడానికి సిద్ధం అవుతూ ఉన్నాడు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ సినిమాకి తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా గ్లిమ్స్ సినిమా పై మంచి ఇంప్రెషన్ ని కలిగించింది అని చెప్పాలి. రాజశేఖర్ లుక్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకోగా ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టేలా అనిపిస్తుంది గ్లిమ్స్ ని చూస్తుంటే… మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here