Home గాసిప్స్ ఈ న్యూస్ కనుక నిజం రాజశేఖర్ కెరీర్ టర్నింగ్ పాయింట్ పక్కా!

ఈ న్యూస్ కనుక నిజం రాజశేఖర్ కెరీర్ టర్నింగ్ పాయింట్ పక్కా!

0

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకప్పుడు ఓ రేంజ్ లో హిట్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నా కానీ తర్వాత సరైన హిట్స్ లేక కెరీర్ మొత్తం డౌన్ ఫాల్ అవ్వడం కంప్లీట్ గా మార్కెట్ కి దెబ్బ పడటం లాంటివి జరిగిన హీరోల్లో యాంగ్రీ మాన్ రాజశేఖర్ ఒకరు. ఒకప్పుడు అద్బుతమైన విజయాలను సొంతం చేసుకున్నా తర్వాత చివరి సారిగా క్లీన్ హిట్ ని సొంతం చేసుకున్నది మాత్రం….

2008 టైం లో గోరింటాకు సినిమా తో… ఆ సినిమా విజయం తర్వాత తిరిగి కంబ్యాక్ గట్టిగా ఉంటుంది ఇక అనుకున్నా కానీ వరుస పెట్టి ఫ్లాఫ్స్ ని సొంతం చేసుకున్న రాజశేఖర్ మార్కెట్ మళ్ళీ కోల్పోయాడు… తిరిగి 2017 లో గరుడవేగ సినిమా ఆడియన్స్ ను బాగానే మెప్పించినా కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ను మాత్రం సొంతం చేసుకోలేక పోయింది. ఇక తర్వాత కల్కి సినిమా కూడా మెప్పించినా బ్రేక్ ఈవెన్ కాలేదు. దాంతో రెండు మంచి సినిమాలు చేసినా కమర్షియల్ సక్సెస్ సొంతం కాకపోవడం తో ఇప్పుడు మళ్ళీ డిఫెరెంట్ మూవీస్ చేస్తున్న రాజశేఖర్ ఇప్పుడు వాటితో పాటు…

ఓ మాస్ కమర్షియల్ మూవీ లో కీలక రోల్ చేస్తున్నారని సమాచారం. యాక్షన్ హీరో గోపీచంద్ మరియు శ్రీవాస్ ల కాంబోలో లక్ష్యం, లౌక్యం లాంటి బ్లాక్ బస్టర్ ల తర్వాత రూపొందుతున్న హాట్రిక్ మూవీ లో రాజ శేఖర్ కీలక పాత్ర చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం లక్ష్యంలో జగపతిబాబు పోషించిన పాత్ర రేంజ్ లో…

రాజ శేఖర్ రోల్ ఈ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇంకా అఫీషియల్ గా ఏమి కన్ఫాం కాలేదు కానీ ఒకవేళ కన్ఫాం అయ్యి లక్ష్యం రేంజ్ లో సినిమా క్లిక్ అయితే ఇటు రాజ శేఖర్ కి అద్బుతమైన కంబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది, దాంతో పాటు గోపీచంద్ కి ఓ మాస్ హిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here