Home న్యూస్ రాజా విక్రమార్క టోటల్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్….టోటల్ థియేటర్స్ కౌంట్!

రాజా విక్రమార్క టోటల్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్….టోటల్ థియేటర్స్ కౌంట్!

2022
0

యంగ్ హీరో కార్తికేయ నటించిన RX100 సూపర్ హిట్ విజయం తర్వాత కార్తికేయ చేసిన సినిమాలు ఏవి కూడా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేదు, గుణ369, 90ML లాంటి సినిమాలు పర్వాలేదు అనిపించాయి, ఇక ఈ ఇయర్ వచ్చిన చావు కబురు చల్లగా అంచనాలను అందుకోలేకపోయింది. ఇలాంటి టైం లో హిట్ ఎలాగైనా కొట్టాల్సిన అవసరంతో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా విక్రమార్క సినిమా….

12 న గ్రాండ్ గానే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది… ఇక సినిమా ఓవరాల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ అండ్ బిజినెస్ లెక్కలు ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలను గమనిస్తే… నైజాంలో 1.4 కోట్ల బిజినెస్ ను సీడెడ్ లో 65 లక్షల బిజినెస్ ను టోటల్ ఆంధ్రలో…

1.55 కోట్ల మేర బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుందట. దాంతో తెలుగు రాష్ట్రాలలో 3.6 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుందట. దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే…

4.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సి ఉంటుంది… ఇక సినిమా థియేటర్స్ ని గమనిస్తే… నైజాం లో 182 థియేటర్స్ లో సీడెడ్ లో 80 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఆంధ్రలో 220 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 480 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా టోటల్ వరల్డ్ వైడ్ గా…

600కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది, అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ స్టార్ట్ అయినా సినిమా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అవుతుంది, టాక్ బాగుంటే షో షోకి కలెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వొచ్చు… మరి సినిమా ఎంతవరకు ఈ థియేటర్స్ లో ఆ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ను అందుకుని కార్తికేయ కి మంచి కంబ్యాక్ మూవీగా నిలుస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here