పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్(The Raja Saab Movie) సినిమాతో ఈ ఇయర్ ఎండ్ లో మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది…
ఓవరాల్ గా సినిమా మీద అంచనాలు కూడా సాలిడ్ గా పెరిగేలా చేసింది. ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీస్ లో ఎంటర్ టైన్ మెంట్ తో చేస్తున్న కమర్షియల్ టచ్ ఉన్న మూవీ ఇదే కాగా టాప్ స్టార్స్ లో ఎవ్వరూ టచ్ చేయని హర్రర్ కామెడీ జానర్ ను…
ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ టచ్ చేస్తూ ఉండటం, మారుతి ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ తీయడంలో దిట్ట అవ్వడంతో మినిమమ్ గ్యారెంటీ అనిపించే రేంజ్ లో ది రాజా సాబ్ సినిమా ఉండే అవకాశం ఎంతైనా ఉందని అందరూ నమ్ముతూ ఉండగా…
టీసర్ రిలీజ్ తర్వాత బిజినెస్ కూడా మంచి ఆఫర్స్ ను సొంతం చేసుకుంటూ ఉన్న రాజా సాబ్ సినిమా రీసెంట్ గా ఆడియో రైట్స్ ని భారీ రేటుకి అమ్మారు, రీసెంట్ టైంలో ప్రభాస్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేటు అనిపించే విధంగా రాజా సినిమా ఆడియో హక్కులకు…
ఆల్ మోస్ట్ 20 కోట్ల రేంజ్ లో రేటు సొంతం అయినట్లు తెలుస్తుంది…త్వరలోనే సినిమా నుండి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. కల్కితో 1000 కోట్ల మార్క్ ని దాటేసి రచ్చ చేసిన ప్రభాస్ ఈ హర్రర్ కామెడీ జానర్ మూవీ తో ఎలాంటి కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.